'డాకూ మహారాజ్' రికార్డును బద్ధలు కొట్టిన 'సంక్రాంతికి వస్తున్నాం'
ఈ ఏడాది సంక్రాంతికి మూడు సినిమాలు పోటీపడ్డాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకూ మహారాజ్, అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడు శంకర్ వైఫల్యంతో రామ్ చరణ్ కు నిరాశ తప్పలేదు. ఈ సినిమా మొదటిరోజు మొదటి ఆట నుంచే ఫ్లాప్ టాక్ మూటకట్టుకుంది. తర్వాత విడుదలైన డాకూ మహారాజ్ తొలిరోజు తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. 14న విడుదలైన వెంకీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా తొలిరోజు తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో గేమ్ ఛేంజర్ వెనకబడిపోయింది. దాదాపుగా ప్రేక్షకులు ఈ సినిమాను మర్చిపోయారని చెప్పొచ్చు.
పోటీపడుతున్న డాకూ, సంక్రాంతికి వస్తున్నాం
కలెక్షన్లు రాబట్టుకునే విషయంలో డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు పోటీపడుతున్నాయి. డాకూ మహారాజ్ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.105 కోట్లు రాబట్టి రూ.200 కోట్ల కలెక్షన్ల వైపు దూసుకుపోతోంది. మొదటిరోజు రూ.46 కోట్లు రాబట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మూడు రోజులకే రూ.106 కోట్లు రాబట్టింది. కేవలం 72 గంటల వ్యవధిలోనే డాకూ మహారాజ్ రికార్డును బద్ధలు కొట్టింది. దీంతో వెంకీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కుటుంబ ప్రేక్షకులంతా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసేందుకే ప్రాధాన్యం ఇవ్వడంతో దీనికి కలెక్షన్లు పెరిగాయి.

అర్థరాత్రి వేళ ప్రత్యేక షోలు
మరోవైపు డాకూ మహారాజ్ కు ఉభయ గోదావరి జిల్లాలతోపాటు సీడెడ్ లో కూడా అర్థరాత్రివేళ ప్రత్యేక షోలు వేస్తున్నారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుందికానీ తెలంగాణలో సరైన సంఖ్యలో థియేటర్లు దొరక్కపోవడంతో కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. గేమ్ ఛేంజర్ ను థియేటర్ల నుంచి ఎత్తేస్తే వాటిని డాకూ మహారాజ్ తో నింపేసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఏడాది క్రితం సైంధవ్ సినిమాతో ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్న వెంకీ ఏడాది సమయంలోనే బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వడం విశేషం. దర్శకుడు అనిల్ రావిపూడి ద్వితీయార్థంలో కొంచెం తడబడినప్పటికీ కామెడీతో ఈ సినిమా కలెక్షన్లను రాబడుతోంది. మొత్తం ఎంత సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications