పవిత్రా లోకేష్‌లో ఎంత టాలెంట్ ఉందో తెలుసా: నరేష్
పవిత్రా లోకేష్ - నరేష్ జంట గురించి దక్షిణ భారతదేశంలో ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. దేశంలో కరోనా తర్వాత అత్యంత ప్రజాదరణ దక్కించుకున్న రెండో విషయం ఏదన్నా ఉందా? అంటే అది కేవలం వీరిద్దరి ప్రేమ వ్యవహారమే. ప్రధాన మీడియా నుంచి సోషల్ మీడియా వరకు వీరి వార్తలే ఉండేవి. ఒకానొక సందర్భంగా పవిత్ర చదువుతున్న చదువు గురించి నరేష్ చాలా గర్వంగా చెప్పారు. ఆమె కుటుంబానికి మంచి అకడమిక్ బ్యాక్ గ్రౌండ్ ఉందని, ఆంగ్లంతోపాటు కన్నడంలో కూడా మాస్టర్స్ డిగ్రీని పవిత్ర చేసిందని వెల్లడించారు.
ఆమె చదువుపై తనకు ఎంతో గర్వంగా ఉంది
పవిత్రా లోకేష్ పుస్తకాలు బాగా చదువుతుందని, ఏ విషయాన్నైనా నేర్చుకోవడంలో ఎంతో ఆసక్తి కలిగివుంటుందని, ఆమెకు గౌరవ డాక్టరేట్ ఉండటం తనకు ఎంతో గర్వంగా ఉందని నరేష్ అన్నారు. ఆమె చదువుపై తాను ఎంతో గర్విస్తున్నానన్నారు. సినిమాలు లేనప్పుడు ఎప్పుడూ చదువుతుంటుందని, పవిత్రతోపాటు హంపి యూనివర్సిటీకి తాను వెళ్లానని, మహిళలపై, రంగస్థలంపై పీహెచ్ డీ చేస్తానని చెప్పినప్పుడు తనకు ఎంతో సంతోషంగా అనిపించిందన్నారు. ఓ దేవాలయంపై డాక్యుమెంటరీ తీసిందనే విషయాన్ని కూడా చెప్పారు.

త్వరలోనే ప్రపంచ పర్యటనకు వెళుతున్నాం
నరేష్, పవిత్రా లోకేష్ వివాహ బంధంపై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. వీరిపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఆరోపణలు చేయడం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో కూడా సంచలనం రేకెత్తింది. వీటిని ఆధారంగా చేసుకొని తాము ఎందుకు పెళ్లి చేసుకోవల్సి వచ్చింది అనే విషయాన్ని తెలియజేస్తూ మళ్లీ పెళ్లి అనే సినిమా చేశారు. మూడో భార్యకు సంబంధించిన వివాదం కోర్టులో ఉండటంతో పెళ్లి చేసుకోకుండా వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. కోర్టు తీర్పును బట్టి వీరి భవిష్యత్తు ఆధారపడివుంటుంది. భవిష్యత్తులో తామిద్దరూ ప్రపంచ పర్యటనకు వెళ్లే అవకాశం ఉన్నట్లు నరేష్ తెలిపారు.












Click it and Unblock the Notifications