Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తనకన్నా చిన్న వయసున్న స్టార్ హీరోతో మీనా పెళ్లి?

అలనాటి అందాల తార మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్ లాంటి స్టార్ హీరోలతో తెలుగులో, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలతో తమిళంలో సినిమాలు చేసింది. బాలనటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి దక్షిణాదిలో అగ్ర కథానాయికగా చెలామణి అయింది. ఇటీవలే ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించారు. అప్పటినుంచి ఏకైక కుమార్తె నైనికతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. కొన్ని కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇటువంటి తరుణంలో మీనా పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ధనుష్ ను పెళ్లిచేసుకోబోతోందంటూ..
భర్త మరణం నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే బయట ప్రపంచంలోకి అడుగుపెడుతున్న మీనా పెళ్లిపై వస్తున్నవన్నీ పుకార్లే అని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఇటీవలే ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చినా మీనా కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన పెళ్లిపై రకరకాల వార్తలు రాస్తున్నారని, అవన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. తమిళ స్టార్ హీరో ధనుష్ ను పెళ్లి చేసుకోబోతోందంటూ కొందరు వార్తలు రాశారని, ఆయన ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతుండటంతో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని కోలీవుడ్ మీడియా వార్తలు రాయగా వాటినే మీనా ఉటంకించారు.

senior heroine Meena is going to marry hero Dhanush who is younger than her

కొందరు పిచ్చిపిచ్చి వార్తలు రాస్తున్నారు
ఏదో ఒక విషయాన్ని హైలైట్ చేయాలి అనే ఉద్దేశంతో ఉండే కొందరు పిచ్చిపిచ్చి వార్తలు రాస్తున్నారని, ఈ క్రమంలోనే తనను ధనుష్ తో ముడిపెట్టి పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు రాశారంటూ వాటిని కొట్టిపారేసింది. తాను ఒంటరిగా జీవితాన్ని గడపడానికే ప్రయత్నిస్తానని, తనకు ఓ కూతురు ఉందని, తన భవిష్యత్తు చాలా ముఖ్యమని, జీవితంలో ఏది జరిగితే అదే జరుగుతుంది.. నేను అదే కోణంలో ముందుకు సాగాలనుకుంటున్నానంటూ వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు ధనుష్ తో మీనా పెళ్లి అంటూ వచ్చిన వార్తలపై ఓ స్పష్టత ఇచ్చింది. భవిష్యత్తులోను ఈ తరహా వార్తలు రాయొద్దని మీడియాను కోరింది. దీనివల్ల మానసికంగా బాధపడాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం మీనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+