పవన్‌కల్యాణ్ జీవితంలో ఆమె 'వెరీ వెరీ స్పెషల్'!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీద్వారా ఏపీ రాజకీయాల్లో గేమ్‌ఛేంజర్‌గా నిలిచారు. తెలుగుదేశం-బీజేపీతో కలిసి కూటమిని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారు. పోటీచేసిన 21 స్థానాల్లోను విజయం సాధించి ఆ పార్టీ వందకు వందశాతం స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. స్వయంగా తాను పోటీచేసిన పిఠాపురం నియోజకవర్గం నుంచి తన ప్రత్యర్థి వంగా గీతపై 70,279 మెజారిటీతో సంచలన విజయం సాధించారు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.
జంట ఆకట్టుకుంది
పవన్ కల్యాణ్ సినిమా జీవితంలో ఆమెకు ఓ ప్రత్యేకత ఉందని, ఆమెవల్లే తమ హీరోకు సూపర్ హిట్ లభించి అప్పటివరకు కష్టకాలంలో ఉన్నవాడల్లా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడంటూ ఓ వార్తను పవన్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు శ్రుతిహాసన్. తనవల్లే గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారని, జంట బాగుందంటూ పేరు వచ్చిందన్నారు. తర్వాత వీరిద్దరూ కాటమరాయుడు సినిమా చేశారు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ వీరిద్దరు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరిద్దరి అభినయానికి కూడా మంచి పేరు వచ్చింది.

మూడు సినిమాలు ప్రత్యేకం
గబ్బర్ సింగ్, కాటమరాయుడు తర్వాత వకీల్‌సాబ్ లో నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇలా పవన్ తో తెరను పంచుకొని మంచి హిట్లు ఇచ్చిన శ్రుతిహాసన్ అంటే తమకు ఎంతో అభిమానమని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పవన్ కల్యాణ్ ఈనాడు రామోజీరావు అస్తమించడంతో ఆయనకు నివాళులర్పించేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. రామోజీరావుకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. ప్రమాణస్వీకారం అయిపోయిన తర్వాత వచ్చి రామోజీరావును కలుద్దామనుకున్నానని, కానీ ఇలా అయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications