ప్రియుడుతో శ్రుతి హాసన్ బ్రేకప్..ఆ దర్శకుడుతో కొత్త రిలేషన్..?
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి హాసన్..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్, మహేష్‌తో శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో శృతి హాసన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది.
తన వ్యక్తిగత జీవితమే శృతి సినీ కెరీర్‌ను పాడు చేసింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్‌షిప్‌కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలేకు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది.

ఆ తరువాత డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో శ్రుతి హాసన్ మరోసారి ప్రేమలో పడింది. ముంబైలో వీరిద్దరూ సహజీవనం చేస్తూ కాపురం పెట్టేశారు. ఈ జంట ఇన్ని రోజులు ఎంతో ఎంజాయ్ చేస్తూ గడిపారు. శ్రుతి హాసన్ తన సహజీవనం విషయాన్ని ఎప్పుడు దాచాలని ప్రయత్నించలేదు. తన ప్రియుడుతో ఉన్నటువంటి ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదిక అభిమానులతో పంచుకుంటూ ఉండేవారు.
పబ్‌లకు వెళ్లిన, పార్టీలకు వెళ్లిన ..ఎక్కడి వెళ్లినా ప్రియుడుతో కలిసి దర్శనం ఇచ్చేది. అయితే శ్రుతి హాసన్ తాజాగా తన ప్రియుడుకు బ్రేకప్ చెప్పిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని విభేదాల కారణంగా శృతిహాసన్ తన ప్రియుడికి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.అంతేకాకుండా వీరిద్దరూ కూడా సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకోవటంతో వీరిద్దరు విడిపోయినట్టే అని అందరూ భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే శృతిహాసన్ బ్రేకప్‌కు దర్శకుడునే కారణమని తెలుస్తోంది. తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో శృతిహాసన్ ఇటీవల ఓ వీడియో సాంగ్‌లో యాక్ట్ చేసింది. అప్పటి నుంచే శృతిహాసన్,శాంతను హజారికాల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. దీని కారణంగానే వీరిద్దరు వీడిపోయారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications