ఇక నుంచి 'షేక్ జానీ' అని పిలవండి..!
జానీ మాస్టర్ వివాదం తెలుగు ఇండస్ట్రీని కుదుపేస్తోంది. జానీ మాస్టర్ తన దగ్గర పని చేస్తోన్న అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు అందడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ తనపై కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన 21ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. విదేశాల్లో సినిమా షూటింగ్‌లకు తీసుకువెళ్లి నాపై అత్యాచారం చేశాడని జానీ మాస్టర్‌పై సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనే కాకుండా ఆయన భార్య కూడా టార్చర్ చేసిందని, యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
జానీ మాస్టర్ వివాదం తెలుగు ఇండస్ట్రీ సైతం రియాక్ట్ అయింది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి జానీపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అయితే జానీ వివాదంపై తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీడియా సమావేశం నిర్వహించింది. అందులో తమ్మారెడ్డి భరద్వాజ, ఝూన్సీ, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పాల్గొన్నారు. జానీ మాస్టర్ మీద ఆరోపణలు రావడంతో ఈ వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్‌ను ఇప్పటికే ఆదేశించామని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తెలిపారు.

ఈ వివాదంపై తాజాగా ప్రముఖ సింగర్ చిన్మయి, నటి పూనమ్ కౌర్ సైతం రియాక్ట్ అయ్యారు. సింగర్ చిన్మయి స్పందిస్తూ.."యువతి మైనర్ గా ఉన్నప్పుడే ఇలా అత్యాచారానికి ఎలా పాల్పడ్డాడు. ఈ కేసులో ఆమె గట్టిగా పోరాడేందుకు మరింత శక్తిని ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే తప్పు చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ" తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. హీరోయిన్ పూనమ్ కవర్ కూడా.. మాస్టర్ ఫైర్ అవుతుంది " ఇకపై షేక్ జానీ ని ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి. మాస్టర్ అనే పదానికి విలువ ఇవ్వండి" అంటూ షాకింగ్ ట్వీట్ చేసింది.












Click it and Unblock the Notifications