స్టార్ సింగర్ బాగోతం: 30 ఏళ్ల తర్వాత బయటపడ్డ పాడు పని!

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ చుట్టూ మరోసారి వివాదం ముసురుకుంది. ఆయన మొదటి భార్య రంజనా ఝా చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి ఆయన మొదటి భార్య రంజనా ఝా బీహార్ రాష్ట్రం, సుపాల్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో తన భర్తపై అత్యంత ఘోరమైన ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. ఉదిత్ నారాయణ్, ఆయన ఇద్దరు సోదరులు, రెండో భార్య కలిసి తనపై క్రిమినల్ కుట్ర పన్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మోసపూరిత శస్త్రచికిత్స!
రంజనా ఝా ఫిర్యాదు ప్రకారం.. 1996లో వైద్యం చేయిస్తామనే సాకుతో తనను ఢిల్లీలోని ఓ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ తనకు తెలియకుండా తన అంగీకారం లేకుండానే గర్భాశయాన్ని తొలగించారని ఆమె ఆరోపించారు. తాను తల్లి కాకుండా అడ్డుకోవడానికే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె వాపోయారు. ఈ విషయం తనకు చాలా ఏళ్ల తర్వాత మరో అనారోగ్య సమస్యతో డాక్టరును సంప్రదించినప్పుడు తెలిసిందని.. ఈ మోసం తనను మానసికంగా, శారీరకంగా కుంగదీసిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

Singer Udit Narayan in Trouble First Wife Ranjana Jha Accuses Him of Fraud Uterus Removal

1984లో వివాహం.. తర్వాత దూరం
రంజనా తన న్యాయవాదితో కలిసి మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. తన వివరాలు చెబుతూ.. "డిసెంబర్ 7, 1984న ఉదిత్ నారాయణ్‌తో సాంప్రదాయ హిందూ పద్ధతిలో నా వివాహం జరిగింది. పెళ్లయిన కొంతకాలం తర్వాత ఆయన కెరీర్ కోసం ముంబై వెళ్లారు. క్రమంగా మా మధ్య దూరం పెరిగింది. ఆయన రెండో పెళ్లి చేసుకున్న విషయం నాకు మీడియా ద్వారానే తెలిసింది" అని ఆమె పేర్కొన్నారు.

సొంత ఇంట్లోకి రానివ్వలేదు
న్యాయం కోసం తాను ముంబైలోని ఉదిత్ నారాయణ్ ఇంటికి వెళ్లినప్పుడు, తనను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని రంజనా ఆరోపించారు. అక్కడి నుంచి నేపాల్‌లోని తన అత్తవారింటికి వెళ్లినా అక్కడ కూడా ఆదరణ లభించలేదని, చివరకు తన పుట్టింట్లోనే తలదాచుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం అనారోగ్యంతో పాటు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఆమె వెల్లడించారు.

నాకు కావాల్సింది హోదా.. గౌరవం మాత్రమే..
"నేను ఎవరినీ కించపరచడానికో లేక సంచలనం కోసమో ఇక్కడికి రాలేదు. నాకు నా హక్కులు, గౌరవం కావాలి. 30 ఏళ్లుగా నేను చీకట్లోనే ఉన్నాను. ఈ కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నాను" అని రంజనా ఝా స్పష్టం చేశారు. ఈ కేసుపై మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అంజూ తివారీ స్పందిస్తూ.. రంజనా ఝా నుంచి ఫిర్యాదు అందిందని ధ్రువీకరించారు. అయితే ఈ ఘటన దాదాపు 30 ఏళ్ల క్రితం జరిగింది కాబట్టి, అన్ని కోణాల్లో ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపై ఉదిత్ నారాయణ్ పక్షం నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+