2018లోనే అక్కినేని ఇంట్లో అడుగుపెట్టాను - శోభిత ధూళిపాళ

తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ. 2013లో మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్‌ ఇండియా ఎర్త్‌ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.

ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమయాణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభిత ధూళిపాళ లైఫ్‌ లైన్‌లోకి వచ్చింది.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశాడు. ఈక్రమంలోనే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. అతి కొద్దిమంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. నాగ చైతన్యతో రిలేషన్‌పై శోభిత ధూళిపాళ తాజాగా ఓ ఇంటర్య్వూ శోభిత ధూళిపాళ నాగ చైతన్యతో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Sobhita Dhulipala entered Akkineni s house in 2018 itself

2022 ఏప్రిల్ లో నాగ చైతన్యతో స్నేహం మొదలైందని చెప్పిన శోభిత నాగార్జున ఇంటికి 2018లోనే వెళ్లినట్టు చెప్పింది. అంటే సమంత నాగ చైతన్య పెళ్లైన ఏడాదికే శోభిత వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టింది.ఆమె నాగచైతన్యను మొదటిసారి ముంబైలోని ఓ కేఫ్ లో కలిసినట్టు చెప్పారు. అప్పట్లో శోభిత ముంబైలో ఉన్నట్టు నాగ చైతన్య హైదరాబాద్ లో ఉన్నట్టు చెప్పగా, ఆమె తాను వేసుకున్న డ్రెస్ కలర్, చైతు వేసుకున్న డ్రస్ కలర్ కూడా చెప్పింది.

వీరిద్దరు కర్ణాటకలోని ఓ పార్క్ కు వెళ్లినట్టు అక్కడ ఏకాంతంగా కొంత సమయం గడిపినట్టు శోభిత చెప్పింది. ఇద్దరు ఒకరికొకరు గోరింటాకు కూడా పెట్టుకున్నారట... ఆతర్వాత ఇద్దరు కలిసి అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌కు వెళ్లినట్టు తెలిపింది. అదే ఈవెంట్‌కు సమంత సైతం హాజరయ్యారు. శోభిత, నాగ చైతన్య ఈ ఏడాది గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు వెళ్లగా అక్కడ శోభిత కుటుంబాన్ని చైతూ కలిశారని.. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే గోవాలో పెళ్లి గురించి మాట్లాకున్నట్టు శోభిత తెలిపింది. అలా నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి గురించిన విషయాలను శోభిత వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+