అక్కినేని ఇంట పెళ్లిలో కీలక ఘట్టం..సమంతను గుర్తు చేసుకుంటూ..!
సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేర్లలో శోభిత ధూళిపాళ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య వల్ల శోభితా ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చిందనే చెప్పాలి.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశాడు. ఈక్రమంలోనే నాగ చైతన్య , శోభిత ధూళిపాళ సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు.
వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. నాగ చైతన్య -శోభిత ధూళిపాళల పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే శోభిత ధూళిపాళ నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను శోభిత ధూళిపాళ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో శోభిత ధూళిపాళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా పాల్గొన్నారు. తాజాగా శోభిత ధూళిపాళ తన హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఈ హల్దీ ఫంక్షన్ ఫొటోలకు ''రాటా.. తపన.. మంగళ స్నానం'' అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం శోభిత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు మాత్రం కంగ్రాట్స్ చెబుతుండగా, మరికొందరు సమంతను మధ్యలో తీసుకువచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శోభిత ధూళిపాళ హల్దీ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications