పెళ్లికి ముందే తల్లైందా..? పెళ్లైన 5 రోజులకే హాస్పిటల్లో చేరిన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జహీర్ ఇక్బాల్ అనే నటుడితో గత రెండేళ్లుగా రిలేషన్‌లో ఉన్న సోనాక్షి సిన్హా తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకుంది. జూన్ 23న ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో ఈ వేడుక సింపుల్‌గా జరిగింది. సైలెంట్‌గా వివాహం చేసుకున్న సోనాక్షి, తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే పెళ్లై ఐదు రోజులు కూడా గడవకముందే సోనాక్షి సిన్హా హాస్పిటల్‌కు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
దీనిపై అనేక ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. సోనాక్షి సిన్హా పెళ్లి కాకముందే తల్లైందని , అందుకే ఆమె ఆస్పత్రికి వెళ్లారంటూ కథనాలు అల్లేస్తున్నారు. అమలాపాల్ మాదిరిగానే ప్రియుడు వల్ల తల్లి కావడంతోనే సోనాక్షి సిన్హా సైలెంట్‌గా వివాహం చేసుకుందని..ఇప్పుడు అసలు విషయం బయటపడిందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ అయిందని వస్తోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్ని సిన్హా అనారోగ్యంతో ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్చారు.

తండ్రిని చూడటానికే సోనాక్షి అక్కడకు వెళ్లారని తెలుస్తోంది. తండ్రిని కలిసేందుకు ఇలా ఆస్పత్రికి వచ్చి వెళ్లడంతో పుకార్లు వచ్చాయి తప్పితే ఇంకేం లేదని తెలుస్తోంది.సోనాక్షి పెళ్లి సమయంలో హడావిడి కారణంగా కాస్త ఒత్తిడికి లోనవడంతో అతడు కాస్త అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది.ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడనే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉంటే సోనాక్షి సిన్హా పెళ్లి విషయంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.
సోనాక్షి సిన్హా ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.సోనాక్షి ముస్లిం మతంలోకి మారుతుందంటూ పుకార్లు కూడా వచ్చాయి. కూతురు పెళ్లిపై శతృఘన్ సిన్హా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కాలం పిల్లలు కేవలం విషయం చెబుతారు తప్ప తల్లిదండ్రుల అనుమతి తీసుకోరు కదా అంటూ ఆయన తెలిపారు. అయిష్టంగానే శతృఘన్ సిన్హా కూతురు వివాహానికి ఓకే చెప్పినట్టు వార్తలొచ్చాయి.












Click it and Unblock the Notifications