17 ఏళ్లకి స్టార్ హీరోయిన్.. 23 ఏళ్లకే వ్యభిచారం.. ఆ నటి ఎవరంటే ?
చిత్ర పరిశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. ఒక్క హిట్ తో స్టార్లుగా ఎదిగిన వారు.. ఒక పొరపాటుతో కెరీర్ నాశనం చేసుకున్న ఘటనలను చూడొచ్చు. బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చిన్న వయసులోనే జాతీయ అవార్డును సొంతం చేసుకొని.. 17 ఏళ్లకే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ ఊహించని విధంగా కెరీర్ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న తరుణంలోనే 23 ఏళ్ల వయస్సులో వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యి కెరీర్ లో వెనుకబడుపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ పడి లేచిన కెరటం లాగా వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ అవుతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరు ? ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.. ?
ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చాక ఆమె ఎవరో మీరు గుర్తు పట్టే ఉంటారు. ఆ ప్రముఖ నటి " శ్వేత బసు ప్రసాద్ ". బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. 2002లో వచ్చిన హిందీ చిత్రం 'మక్డీ' లో ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ఆ సినిమాకు జాతీయ ఉత్తమ బాలనటిగా అవార్డును పొందింది. ఆ తర్వాత టీవీ సీరియల్స్, బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.

ఇక 2008లో విడుదలైన 'కొత్త బంగారు లోకం' సినిమాతో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. "స్వప్న" పాత్రతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. దాంతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకొని ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన 'రైడ్', 'కాస్కో', 'కళవర్ కింగ్' చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోవడంతో కెరీర్ లో కాస్త స్లో అయ్యింది.
కానీ అనూహ్యంగా 2014లో ఓ భారీ వివాదంలో ఇరుక్కుపోయింది శ్వేతా. హైదరాబాద్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో వ్యభిచారం కేసులో ఆమెను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాను ఓ ఈవెంట్ కోసం మాత్రమే వచ్చానని వాదనలు వినిపించింది. ఆ తర్వాత విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు క్లిన్ చిట్ ఇచ్చింది. కానీ కేసుల వ్యవహరంతో వివాదాల్లో చిక్కుకున్న ఈమె సినిమాలకు కూడా దూరం అయ్యింది.
2018లో ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ ను వివాహం చేసుకుంది. అయితే ఈ వారిద్దరూ 2022లో విడాకులు తీసుకున్నారు. కానీ మనోధైర్యాన్ని మాత్రం కోల్పోకుండా మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టిన ఈమె సినిమాల్లో అవకాశాలు తగ్గినా.. ఓటీటీలో సత్తా చాటుతూ తిరిగి క్రేజ్ సంపాదించుకుంది. వరుసగా వెబ్ సిరీస్‌లు చేస్తూ మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
రీసెంట్ గానే ఊప్స్ అబ్ క్యా, జిందగినామా, త్రిభువన్ మిశ్రా - CA టాపర్, అన్ రియల్ వంటి వెబ్ సిరీస్ లతో మెప్పించింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. త్వరలోనే తెలుగులోనూ శ్వేతా బసు ప్రసాద్ ఆఫర్స్ అందుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మే 1 నుంచి సినిమా థియేటర్లు బంద్? -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
హొంబలే ఫిల్మ్స్ లక్కీ ఛాన్స్ -
టాలీవుడ్లో మరో జంట విడాకులు.. షాక్‌లో ఫ్యాన్స్! -
బెస్ట్ యాక్టర్‌గా మరో అవార్డ్ అందుకున్న అక్కినేని హీరో..! -
చిక్కుల్లో పడ్డ యంగ్ హీరో.. పార్టీలకు రావాలంటూ అమ్మాయిలకు మెసేజ్‌లు? -
కోలీవుడ్ పట్టించుకోకున్నా "దళపతి విజయ్"కి అండగా మెగాస్టార్..! -
మోనాలిసాకు ఊహించని షాక్: భర్తపై పోక్సో కేసు -
ఆ స్టార్ డైరెక్టర్ అందరి ముందు చీర విప్పి పడుకోమన్నాడు !! -
మళ్లీ కొత్త పంచాయతీతో కోర్టుకెక్కిన అల్లు అర్జున్ హీరోయిన్..












Click it and Unblock the Notifications