పవన్ కల్యాణ్ పక్కన హీరోయిన్‌గానా..? చేయనని తప్పుకున్న స్టార్ హీరో భార్య..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారాయన. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికీ ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఖుషి సినిమాతో పవన్ కల్యాణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
పవన్ కల్యాణ్ కెరీర్‌తో బ్లాక్ బాస్టర్ హిట్‌గా ఖుషి సినిమా నిలిచింది. ఆ తర్వాత ఆయనకు పదేళ్ల పాటు హిట్ సినిమా లేదు. తిరిగి గబ్బర్ సింగ్ సినిమాతో ఆయన హిట్ కొట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ పక్కన నటించాలని చాలామందికి ఆశగా ఉంటుంది. అయితే ఓ హీరోయిన్ మాత్రం పవన్ కల్యాణ్‌తో నటించడానికి రెండుసార్లు అవకాశం వచ్చినా నటించలేదు. ఆ హీరోయిన్ మరెవరో కాదు నమ్రత శిరోద్కర్.

నమ్రత శిరోద్కర్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య అన్న సంగతి తెలిసిందే.మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మహేష్‌ను వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు దూరం అయింది నమ్రత. అయితే నమ్రత నటించే సమయంలో పవన్‌తో సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ చేయలేకపోయిందట.
నమ్రత శిరోద్కర్ ఒకప్పుడు బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉండేవారు. ఆ సమయంలో, దర్శకుడు పూరీ జగన్నాథ్ తన సినిమా 'బద్రి'లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం కోసం నమ్రతను సంప్రదించారు. నమ్రతకు ఈ కథ చాలా నచ్చి, సినిమాలో నటించడానికి ఆసక్తి కూడా చూపారు.
అయితే, అదే సమయంలో నమ్రత బాలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటిస్తుండటం వల్ల డేట్లు సర్దుబాటు చేయలేకపోయారు. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె 'బద్రి' చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చిందని సమాచారం.
అలాగే పవన్ నటించిన బాలు సినిమాలో కూడా తొలుత నమ్రతనే సంప్రదించారట.అయితే అప్పటికే మహేష్ బాబుతో ప్రేమలో ఉన్న నమ్రత, ఇక మీదట సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారట. ఇలా పవన్ కల్యాణ్‌తో నటించే అవకాశం రెండుసార్లు వచ్చినా ఈ భామ వదులుకోవాల్సి వచ్చిందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications