‘మహేంద్రగిరి వారాహి’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు డబుల్!
అక్కినేని హీరో సుమంత్ సరికొత్త స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా 'మహేంద్రగిరి వారాహి' థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
కాశీలో పూజలందుకునే గ్రామాధిదేవత 'వారాహి మాత' పరమశివుని ఆజ్ఞతో మహేంద్రగిరిలో వెలిసినట్లు ఈ స్టోరీ చూపంచారు. గత 150 ఏళ్లుగా ఆ ఊరి రాజకుటుంబానికి చెందిన వ్యక్తులు రహస్యంగా ప్రాణాలు కోల్పోతుంటారు. అమ్మవారి శాపం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని స్థానికులు భావిస్తుంటారు. ఈ శాపం వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటకు తీసి దైవ శక్తిని కూడా ప్రశ్నించే ధైర్యం చేసే హీరో పాత్రలో సుమంత్ కనిపించారు. అసలు ఆ శాపం వెనుక ఉన్న రహస్యమేంటి? హీరో దానిని ఎలా ఛేదించాడు? అనేదే ఈ సినిమా కథాంశం.

సుమంత్ తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. శతాబ్దాల నాటి రహస్యాన్ని ఛేదించే పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఐశ్వర్య రాజేష్ వారాహి మాతగా దైవిక రూపంలో కనిపిస్తుండగా.. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఓ కీలక పాత్రలో ఊహించని సర్పైజ్ఇవ్వడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
డైరెక్టర్ సంతోష్ జాగర్లమూడి కథను నడిపించిన తీరు, ప్రతాప్ ఆర్ కృష్ణ సినిమాటోగ్రఫీ దృశ్యాలను ఎంతో సహజంగా చూపించాయి. అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ ను రెట్టింపు చేసింది. లక్ష్మణ్, కాళిపు మధు నిర్మించిన ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఘనంగా కనిపిస్తున్నాయి. ఓ ప్రత్యేకమైన కథ, సాంకేతిక బలం, ఆకట్టుకునే నటీనటులతో రూపొందిన 'మహేంద్రగిరి వారాహి' చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.














Click it and Unblock the Notifications