రెండు ఓటీటీల్లోకి సుమంత్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్..ఇప్పుడే చూసేయండి..!
ఇటీవలి కాలంలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకుల్ని విపరీతంగా .కంటెంట్ తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. సినిమా బాగుంటే చాలా చిన్న సినిమానా..? లేక పెద్ద సినిమానా..? అని చూడట్లేదు. ఇక రీసెంట్ గా అక్కినేని హీరో సుమంత్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ న్యూటన్స్ థర్డ్ లా.. ఈ మూవీ జూలై 31న థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను ఈ మూవీ అందుకోలేక పోయింది. కానీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది.
ఈ మూవీలో సుమంత్ తో పాటు జగపతి బాబు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ, నేహా పఠాన్, త్రినాథ్ వర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీకి సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందించారు. ఇక న్యూటన్ థర్డ్ లా చిత్రాన్ని కే. హరీష్ నిర్మించగా.. ఈటీవీ విన్ సమర్పించింది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈటీవీ విన్, నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. 1999 నాటి జంట హత్యల కారణంగా ఈ మూవీ తెరకెక్కింది.

న్యూటన్ థర్డ్ లా స్టోరీ విషయానికి వస్తే.. వినయ్ (త్రినాథ్ వర్మ) ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్. బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు. ఓ రోజు కుటుంబంలో గొడవ జరిగిన తర్వాత అనూహ్యంగా బిల్డింగ్ పై నుంచి పడి మరణిస్తాడు. ఈ ఘటనను మొదట యాక్సిడెంట్ గా భావించినప్పటికీ.. తలలో బుల్లెట్ ఉండటంతో మర్డర్ అనే కోణంలో పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ (సుమంత్) ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఈ క్రమంలో జ్యోతి(నేహా పఠాన్) అనే మహిళ వినయ్ కారు యాక్సిడెంట్ లో మరణిస్తుంది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి..? నగరాన్ని శాసిస్తున్న మాఫియా డాన్ మెర్కురీ (జగపతిబాబు)కు వినయ్ కు ఉన్న సంబంధం ఏంటి..? జ్యోతి మరణానికి వినయ్ కు ఎలాంటి సంబంధం ఉంది..? న్యూటన్ థర్డ్ లా పుస్తకం రాసిన రచయితకు మర్డర్ మిస్టరీకి ఉన్న రిలేషన్ ఏంటి..? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.












Click it and Unblock the Notifications