ఈ టీజర్ ఏంటి భయ్యా ఇలా ఉంది..? సుస్సు పడుతోంది బాబోయ్..!
టాలీవుడ్ నటుడు సుమంత్ ఇటీవలి కాలంలో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్.. కెరీర్ బిగినింగ్ లో ప్రేమకథ, యువకుడు, సత్యం, గౌరి సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఆ తర్వాత గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్లీ రావా చిత్రాలతో మెప్పించారు. ఇటీవల సీతారామం చిత్రంలో కీలకమైన పాత్ర పోషించారు సుమంత్. ఆ తర్వాత అనగనగా అనే చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.
అయితే సుమంత్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం 'మహేంద్రగిరి వారాహి'.. ఈ మూవీ డివైన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. మధు కలిపు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ గోస్వామి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అఫీషియల్ టీజర్ ను తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్ చూసిన వాళ్లకు గూస్ బంప్స్ వస్తున్నాయి.
'మహేంద్రగిరి వారాహి' మూవీ టీజర్ చూస్తే స్టార్టింగ్ నుంచి ప్రేక్షకులను ఒక మిస్టరీ లోకంలోకి తీసుకెళ్తుంది. వారాహి అమ్మవారి శక్తి, మహేంద్రగిరి అనే గ్రామం చుట్టూ అల్లుకున్న ఒక పురాతన రహస్యం.. ఆ ఊరిని పట్టి పీడిస్తున్న ఒక అజ్ఞాత శక్తి.. వీటన్నింటి చుట్టూ కథ తిరుగుతుందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. టీజర్ లో తెలిపిన వివరాల ప్రకారం.. మహేంద్రగిరి అనే గ్రామంలో వారాహి అమ్మవారి గుడి వందల సంవత్సరాల క్రితం వెలుస్తుంది. అయితే ఆ గ్రామాన్ని పరిపాలించే భూపతి మహారాజ్ అక్కడి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే సమయంలో అమ్మవారి గుడిలో ఓ బిడ్డ కనపడుతుంది.
ఆ బిడ్డకు ముత్యాలమ్మ అని పేరు పెట్టి పూజిస్తుంటారు. అది తట్టుకోలేని భూపతి మహారాజ్.. ముత్యాలమ్మను కిరాతకంగా చంపేస్తాడు. దీంతో కోపంతో వారాహి అమ్మవారు.. రాజు కుటుంబానికి శాపం పెడుతుంది. ఆ ఇంట్లో పుట్టిన వారసుడు 33 సంవత్సరాలకు మించి బతకడు అని శపిస్తుంది. అలా రాజ వంశానికి చెందిన వారు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు.

అయితే ఇప్పటివరకు జరిగిన ప్రతి చావు వెనుక ఒకే ఒక్క క్లూ కనిపిస్తుంది. అసలు ఆ క్లూ ఏంటి..? ఈ మూవీలో ఇన్ వెస్టిగేషన్ చేస్తున్న సుమంత్ పాత్ర ఏంటి..? అనే ఆసక్తికర కథాంశంతో టీజర్ ను విడుదల చేశారు. ప్రేక్షకుల్లో టీజర్ ఆసక్తిని రేపుతోంది. ఇక విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. టీజర్ చూస్తుంటే సుమంత్ ఖాతాలో మరో హిట్టు గ్యారంటీ అని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications