రాజమౌళి తర్వాత మహేష్‌బాబు చేసే సినిమా డైరెక్టర్ ఫిక్స్
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీ ఒకటి చేస్తున్నారు. వచ్చే ఏడాది చివరకు లేదంటే తర్వాత ఏడాది ఇది విడుదల కాబోతోంది. రెండు భాగాలుగా వస్తుందా? ఒక భాగమే ఉంటుందా? అనే విషయంలో స్పష్టత లేదు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు హాలీవుడ్ హీరో అవుతారని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
రాజమౌళితో చేసిన తర్వాత ఫ్లాప్ అవడం ఖాయం
రాజమౌళితో సినిమా చేసిన తర్వాత కచ్చితంగా తర్వాత సినిమా ఫ్లాప్ అవడం హీరోలకు ఆనవాయితీగా వస్తోంది. అయితే మహేష్ బాబు రాజమౌళి తర్వాత ఎవరి దర్శకత్వంలో చేయాలనే విషయంలో ఇప్పటికే స్పష్టతగా ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప2తో భారీ హిట్ కొట్టిన సుకుమార్ దర్శకత్వంలో ఆయన సినిమా చేయబోతున్నారు. వన్ నేనొక్కడినే సినిమా ఫ్లాప్ కావడంతో మహేష్ బాబుకు సుకుమార్ ఎలాగైనా హిట్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో మహేష్ బాబు 30వ సినిమా తెరకెక్కబోతోంది.

ఆ ఇద్దరిలో ఎవరైనా పర్వాలేదు
మరోవైపు సందీప్ రెడ్డి వంగా మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. యానిమల్ చేయాలనుకున్నప్పటికీ తన మనస్తత్వానికి అది విరుద్ధంగా ఉంటుందని మహేష్ తిరస్కరించారు. ఈలోగా స్పిరిట్, యానిమల్ పార్క్ పూర్తిచేసి మహేష్ బాబుతో సినిమా చేయాలనే పట్టుదలతో సందీప్ రెడ్డి వంగా ఉన్నారు. ఒక కథను కూడా వినిపించినట్లు తెలుస్తోంది. అయితే సుకుమార్, సందీప్ రెడ్డి వంగాల్లో ఎవరితో ఒకరితో మాత్రం సినిమా చేయడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. అభిమానులు కూడా ఈ ఇద్దరు డైరెక్టర్లలో ఎవరైనా పర్వాలేదని, సినిమా కచ్చితంగా హిట్ అవుతుందంటున్నారు. మరి మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications