'కంగువా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!
తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తోన్న చిత్రం 'కంగువా'. ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే ప్రతిష్మాత్మకంగా తెరకెక్కింది. 'కంగువా' సినిమా రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. 'కంగువా' తొలి తమి పాన్ ఇండియా సినిమాగా రూపొందించడం జరిగింది. ఈ సినిమాతో సూర్య రూ.1000 కోట్ల మార్కెట్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కంగువా' సినిమాను దాదాపు 38 భాషల్లో విడుదల చేస్తున్నామని మూవీ మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. 'కంగువా' రన్ టైం 2 గంటల 34 నిమిషాలు. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాని మనస్పూర్తిగా మెచ్చుకున్నారని తెలుస్తోంది.సినిమా చాలా గ్రాండ్ గా ఉందని, తమిళ సినిమా గర్వించేలా ఈ సినిమా ఉందని, తప్పకుండా సూర్యకి పెద్ద హిట్ అవుతుందని సెన్సార్ బోర్డ్ మెచ్చుకున్నట్లు తెలుస్తోంది.

ఫస్ట్ రివ్యూ ఇంత పాజిటివ్ గా ఉందంటే ..థియేటర్లలో రిలీజైన తర్వాత ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి. అటు హీరో సూర్య కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. గత మూడేళ్లకు పైగానే ఈ సినిమా కోసం సూర్య కష్టపడ్డారు. షూటింగ్ సమయంలో ఆయనకు పలుమార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. వాటిని తట్టుకుని మరీ ఆయన 'కంగువా' షూటింగ్‌ను పూర్తి చేశారు. అటు హీరోయిన్ దిశా పటానీ సైతం కంగువాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. 'కంగువా తన కెరీర్‌కు మంచి బ్రేక్ ఇస్తోందని దిశా పటానీ భావిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైరల్, పాటలు ఆకట్టుకున్నాయి.దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతోంది.












Click it and Unblock the Notifications