ఆ సీఎం భార్యపై నాకు కోరిక ఉంది..!
ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో హీరోయిన్ స్వరా భాస్కర్ తర్వాతే ఎవరైనా. ఆమె కేవలం ఒక నటిగానే కాకుండా, తన గొంతుకను బలంగా వినిపించే సామాజిక కార్యకర్తగా కూడా గుర్తింపు దక్కించుకున్నారు.'తను వెడ్స్ మను' ,'రాంఝణా' ,'ప్రేమ్ రతన్ ధన్ పాయో','నీల్ బట్టే సన్నాట' ,'వీరే ది వెడ్డింగ్' వంటి సూపర్ హిట్ సినిమాల్లో స్వరా భాస్కర్ నటించింది. స్వరా భాస్కర్ వైవాహిక జీవితంతో కూడా వార్తల్లో నిలిచింది. ఆమె 2023లో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఫహాద్ అహ్మద్‌ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం సాంప్రదాయబద్ధంగా కాకుండా, కోర్టు వివాహంగా జరిగింది.
సినీ పరిశ్రమతో పాటు, స్వరా భాస్కర్ సామాజిక ,రాజకీయ అంశాలపై చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె మహిళా హక్కులు, లౌకికవాదం ,రాజకీయ సమానత్వం వంటి అంశాలపై తన అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేస్తుంటారు. తన నిర్భయత్వం మరియు అభ్యుదయ భావాలతో ఆమె ఎందరికో స్ఫూర్తినిచ్చారు. స్వరా భాస్కర్ తాజాగా మానవ లైంగిక గుర్తింపు (సెక్సువల్ ఐడెంటిటీ) గురించి గురించి చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి.

దీనిపై ఆమె మాట్లాడుతూ..నిజానికి ప్రతి ఒక్కరూ బైసెక్సువలే అని, ప్రతి మనిషి అబ్బాయి, అమ్మాయి ఇద్దరి పట్ల ఆకర్షితులు అవుతారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తూ, తనకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పట్ల "క్రష్" ఉందని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పారు.
ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు స్వరా భాస్కర్‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. స్వర భాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఆమె భర్త, అఖిలేష్ యాదవ్ ఎంత బాధపడి ఉంటారో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమె గతంలో నటించిన కొన్ని సినిమాలను ప్రస్తావిస్తూ..సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఇలాగే ఉంటారా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
స్వరా భాస్కర్ క్రష్ అని చెప్పిన డింపుల్ యాదవ్, రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటారు. ఆమె తన వాగ్దానాలను నిలబెట్టుకుంటూ ప్రజల మధ్య మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి భార్యగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా డింపుల్ యాదవ్ ప్రజలకు సేవలందించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో డింపుల్ యాదవ్ ఎలా స్పందిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications