పక్క ఎక్కే ముందు ఆ పని చేయాలి..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ టబు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈతరం ప్రేక్షకులకు టబు గురించి పెద్దగా తెలియకవచ్చు కానీ 1990ల్లో సినీ అభిమానులకు టబు ఓ డ్రీమ్ గర్ల్. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఈ రెండు కూడా ఆమె సొంతం. అందం, అసాధారణమైన నటనా ప్రతిభకు పేరుగాంచిన బాలీవుడ్ నటి టబు దాదాపు నాలుగు దశాబ్దాలుగా వెండితెరను శాసిస్తున్నారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.
ఇదే సమయంలో బాలీవుడ్‌లో కూడా ఈ ముద్దుగుమ్మ సత్తా చాటింది. టబు బాలీవుడ్‌లో తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూనే తెలుగులోనూ అప్పుడప్పుడు ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించారు.చాలా కాలం తర్వాత, టబు అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం **"అల వైకుంఠపురములో" (2020)**లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది.టబు తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలను పోషించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె ఒక ప్రత్యేకమైన నటిగా గుర్తింపు పొందారు. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి మెప్పించారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టబు, ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమా విశేషాలను సైతం అభిమానులకు వెల్లడిస్తుంటుంది. తాజాగా ఈ సీనియర్ నటి ఓ విషయాన్ని బయటపెట్టింది. తనకు పడుకునే ముందు ఒక స్ట్రాంగ్ కాఫీ తాగే అలవాటు ఉందని టబు చెప్పుకొచ్చింది. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు కూడా తన ఫేవరెట్ కాఫీ బ్రాండ్ తనతోనే తీసుకువెళ్తుంటారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మీ బ్యూటీ సీక్రెట్ ఇదేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్తుతం టబు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా ఉన్నాయి.












Click it and Unblock the Notifications