ఎట్టకేలకు శుభవార్త చెప్పిన తారకరత్న భార్య
నందమూరి హీరో తారకరత్న గతేడాది హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు కుప్పం వెళ్లిన తారకరత్నకు గుండెపోటు రావడంలో హుటాహుటిన బెంగళూరుకు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మృతిచెందడంతో నందమూరి కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. అన్ని విషయాలు దగ్గరుండి చూసుకున్న బాలకృష్ణ తీవ్ర విషాదానికి లోనయ్యారు. తారకరత్న భార్యాపిల్లలకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. పిల్లల పేర్లమీద ఫిక్స్ డ్ డిపాజిట్లు చేశారు.
నిష్మ హాఫ్ శారీ ఫొటోలు
తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలను నెటిజన్లతో పంచుకుంటుంటుంది. తన పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా తెలియజేస్తుంది. కొందరికి సమాధానాలిస్తుంది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా తాజాగా అలేఖ్య రెడ్డి శుభవార్త చెప్పింది. ఈరోజు తన పెద్ద కుమార్తె నిష్మ హాఫ్ శారీ వేడుక జరిగిందంటూ దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ వేడుకలో తారకరత్న ఫొటో కూడా పెట్టి ఆయనకు నివాళులర్పించింది. కార్యక్రమాన్ని చాలా భారీగా నిర్వహించినట్లు తెలిపింది.

కొడుకు మరణించిన తర్వాత కూడా పట్టింపులా?
ఈ కార్యక్రమానికి అలేఖ్యరెడ్డి పెదనాన్న, వైసీపీ నేత విజయసాయిరెడ్డితోపాటు పలువురు బంధుమిత్రులంతా పాల్గొన్నారు. అయితే ఈ వేడుకకు తారకరత్నకు సంబంధించిన తల్లిదండ్రులుకానీ, ఇతర కుటుంబ సభ్యులుకానీ హాజరవలేదు. నందమూరి కుటుంబానికి చెందినవారంతా దూరంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు వారిని పిలవలేదా? అని అలేఖ్యను ప్రశ్నిస్తున్నారు. లేదంటే పిలిచినా వారు రాలేదా? అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో నిష్మకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నాడంటూ తారకరత్న తల్లిదండ్రులు కొన్నాళ్ల నుంచి అతనికి దూరంగానే ఉంటారు. ఆస్తులకు సంబంధించినవి కూడా ఏమీ ఇవ్వలేదని తెలుస్తోంది. అవైనా ఇస్తే అలేఖ్యకు కొంత అండగా ఉంటాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొడుకు మరణించిన తర్వాత కూడా పట్టింపులు అవసరమా? అని మరికొందరు అడుగుతున్నారు.












Click it and Unblock the Notifications