వైసీపీని చిత్తుగా ఓడించండి: త్రివిక్రమ్ శ్రీనివాస్
మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పాలిట ఉగ్రవాదుల్లా మారిన వైసీపీని ఓడించి కూటమిని గెలిపించాలన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కోసం త్రివిక్రమ్ ఓ పాట రాశారు. ఆ పాట రాసినప్పటి నుంచి వైసీపీ త్రివిక్రమ్ ను లక్ష్యంగా ఎంచుకుంది.
5వేల ఫోన్ కాల్స్ వచ్చాయి
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సంవత్సరాల నుంచి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మిత్రులుగా కొనసాగుతున్నారు. రాజకీయంగా పవన్ బిజీగా ఉన్న సమయంలో కూడా ఆయన సినిమాలకు సంబంధించిన అన్ని పనులను త్రివిక్రమ్ చూసేవారు. అదే అభిమానంతో ప్రస్తుత ఎన్నికల కోసం ఓ పాట రాసిచ్చారు. అప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఆయన్ను టార్గెట్ చేసింది. త్రివిక్రమ్ వ్యక్తిగత ఫోన్ నెంబరు, పేరు సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో 5వేల కాల్స్ వచ్చినట్లు త్రివిక్రమ్ చెప్పారు.

పరిస్థితి దిగజారిపోతోంది..
అలా ఫోన్ చేస్తున్నవారంతా తిట్టడం, శాపనార్థాలు పెట్టడం, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంలాంటివి చేశారు. దీనిపై త్రివిక్రమ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆయన వైసీపీని ఓడించాలంటూ పిలుపునిచ్చారు. తెలుగు సినీ పరిశ్రమను వైసీపీ చేజేతులా ప్రత్యర్థిగా మార్చుకుంటోందని సినీ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ మీద అభిమానంతో త్రివిక్రమ్ పాట రాసినందుకు అతన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇలా అయితే ఎవరికి ఎవరు సహకారం అందించుకోలేరని, వైసీపీకి సహకారం అందిస్తున్నవారిపట్ల జనసేన ఏనాడైనా టార్గెట్ చేసుకుందా? వారిని ఏమైనా తిట్టిందా? అంటూ జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని, వైసీపీ పాలనతో రాష్ట్రం ఇప్పటికే దిగజారిపోయిందని, మరోసారి ఆ పార్టీకి అధికారం కట్టబెడితే ఏమీ మిగలదని పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీకి గుణపాఠం చెప్పాలంటూ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications