బాలయ్య, పవన్ కల్యాణ్ కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్
నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటే బాలయ్య హిందూపురం నుంచి మూడోసారి గెలిచి సీనియర్ శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ కలిసి సినిమా చేయనప్పటికీ రాజకీయాల్లో మాత్రం రెండుపార్టీలద్వారా స్నేహసంబంధాలు కొనసాగిస్తూ ఉమ్మడిగా అధికారంలోకి వచ్చారు. స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వీరిద్దరితో కలిసి సినిమాలు చేయాలని దర్శక నిర్మాతలు ఎంత ప్రయత్నించినప్పటికీ సరైన కథలు దొరక్కపోవడంతో కుదర్లేదు.
తడబడ్డ దర్శకుడు
అయితే ఓ దర్శకుడు వీరిద్దరి కోసం కథను సిద్ధం చేశారు. సీనియర్ నిర్మాతను కలవగా ఆయనకు ఈ కథ బాగా నచ్చింది. బాలకృష్ణకు కథ వినిపించడానికి వెళ్లిన దర్శకుడు పవన్ కల్యాణ్ తో మల్టీస్టారర్ అనిచెప్పగా దానికి బాలయ్య ఓకే అన్నారు. అయితే కథ చెప్పే విషయంలో దర్శకుడు బాగా తడబడ్డాడు. దీంతో కథ పక్కదారి పట్టి బాలయ్యకు నచ్చలేదు. దీంతో సినిమా వద్దని చెప్పగా ఆ దర్శకుడు నిర్మాత దగ్గరకు వెళ్లారు. కథలో కొన్ని మార్పు చేర్పులు చేయాలని చెప్పగా చేసి మరోసారి బాలయ్య దగ్గరకు వెళ్దామనుకున్నారు. నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నారని, వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కిద్దామని, పవన్ కు కూడా కథ చెబుతానని దర్శకుడు చెప్పినప్పటికీ బాలకృష్ణ అంగీకరించలేదు.

పొరపాట్లు వద్దని చెప్పిన బాలయ్య
అయితే కథను, స్క్రిప్ట్ ను పూర్తిగా మార్చి రావాలని, ఎటువంటి పొరపాట్లు వద్దని బాలకృష్ణ చెప్పారు. దీంతో ఆ దర్శకుడు కథను పవన్ కల్యాణ్ కు వినిపించడం కూడా వాయిదా వేసుకొని కథలో మార్పు చేర్పులు చేస్తున్నారు. అయితే ఆ కథను బాలయ్యకు వినిపించాల్సి ఉంది. విన్న తర్వాత ఓకే చెబుతారా? లేదా? అనేది దర్శకుడి సమర్థతమీదే ఆధారపడివుంటుంది. బాలయ్య అభిమానులుకానీ, పవన్ కల్యాణ్ అభిమానులు కానీ ఈ సినిమా పట్టాలెక్కాలని గట్టిగా భగవంతుణ్ని కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications