స్టార్ హీరోకు రిమాండ్ రిస్క్, వీడియో కాన్ఫరెన్స్ లో కోర్టుకు సమాచారం, సార్ కు ?

రేణుకాస్వామి హత్య కేసులో నిందితులుగా పరప్పన అగ్రహార జైలులో ఉన్న కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, నటి పవిత్ర గౌడ్ సహా 17 మందిపై విచారణ ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు వీరిని హాజరుపరిచారు. కోర్టు సిబ్బంది అందరి పేర్లను పిలిచి కేసు నెంబర్ చదవడంతో పాటు పేర్లు వినిపించడంతో నిందితులంతా చేతులు పైకెత్తి తాము హాజరు అయ్యామని జైలు నుంచే కోర్టుకు తెలిపారు.

కేసు వివరాలు తెలుసుకున్న న్యాయమూర్తి హీరో దర్శన్, నటి పవిత్ర గౌడతో పాటు నిందితులు అందరి

జ్యుడీషియల్ కస్టడీని జూలై 18వ తేదీ వరకు పొడిగించారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు, తుమకూరు జిల్లా జైలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన మొత్తం 17 మంది నిందితుల జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ప్రభుత్వ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు మనవి చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

The court extended the remand of Kannada star hero Darshan and all the co-accused

నిందితుల తరఫు న్యాయవాది రిమాండ్‌కు దరఖాస్తు చేయాలని కోరారు. రిమాండ్ దరఖాస్తుపై నిందితుల తరఫు న్యాయవాదుల సంతకాలు చేయించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. ప్రస్తుతం నటుడు దర్శన్, ఇతర 16 మంది నిందితులు అసభ్యకరమైన సందేశాలు పంపిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. దీనిపై కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు.

నటుడు దర్శన్ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అయితే ఇప్పటికే చాలా మంది దర్శన్ కు అనుకూలంగా మాట్లాడుతుండగా పలువురు దర్శన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. విచారణ అనంతరం నటుడు దర్శన్‌ని దోషిగా తేలుతాడా, లేక నిర్దోషి అని తేలుతాడా అని కోర్టు విచారణలో తేలాల్సి ఉంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులు ఇంకా లోతుగా కేసు విచారణ చేస్తున్నారని తెలిసింది. ఈ నెల 18వ తేదీ వరకు హీరో దర్శన్, నటి పవిత్ర గౌడతో సహ నిందితులు అందరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉండాలని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+