రామ్‌చరణ్ - రవితేజ కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బస్టర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆయన రేంజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా మధ్యలో శంకర్ భారతీయుడు2 సినిమా చేసి ఘోరమైన డిజాస్టర్ ను మూట్టకట్టుకున్నాడు. దీంతో శంకర్ భవిష్యత్తు గేమ్ ఛేంజర్ పై ఆధారపడివుందని చెప్పొచ్చు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాను చెర్రీ చేస్తున్నాడు.
ధమాకా తర్వాత సరైన హిట్ లేదు
రవితేజ తెలుగులో ఉన్న మంచి ఎనర్జిటిక్ హీరోల్లో ఒకరు. సహాయక పాత్రల నుంచి స్టార్ హీరోగా స్వయంకృషితో, ఎవరి అండ లేకుండా ఎదిగారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు రవితేజను హీరోగా తెలుగులో స్థిరపరిచాయి. ప్రస్తుతం వరుసగా ఫ్లాప్స్ ఇస్తున్న రవితేజ కథలపై దృష్టిపెట్టాలని, డబ్బుల కోసం కాకుండా ప్రేక్షకులకు మంచి సినిమా అందివ్వాలనే ఉద్దేశంతో సినిమాలు చేయాలని అభిమానులు కోరుతున్నారు. ధమాకా తర్వాత సరైన హిట్ చిత్రమే రవితేజ నుంచి రాలేదు. రామ్ చరణ్ - రవితేజ కాంబినేషన్ లో సినిమా రావాల్సి ఉందికానీ అది మిస్ అయింది.

మసాలా పేరుతో తెలుగులో వచ్చింది
హిందీలో సూపర్ హిట్ అయిన బోల్ బచ్చన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావించారు. కొంతమంది నిర్మాతలు ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీపడ్డారు. అయితే చివరకు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు వీటిని దక్కించుకొని తెలుగులో వెంకటేష్-రామ్ కథానాయకులుగా పెట్టి మసాలా పేరుతో సినిమా తీశారుకానీ ఆ సినిమా హిట్ అవలేదు. అదే రవితేజ, రామ్ చరణ్ తో తీసివుంటే బ్లాక్ బస్టర్ అయివుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడైనా వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే మంచి హిట్ అవుతుందని, చూడాలని ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనపడటంలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎవరికివారు సోలోగా సినిమాలు చేస్తూ ఈ ఇద్దరు హీరోలు బిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications