పురాణాలు + ఏఐ టెక్నాలజీ.. ఇండియన్ సినిమాలో సరికొత్త ప్రయోగం.. టైటిల్ వచ్చేసింది!
భారతీయ పురాణాలు, అంతుచిక్కని రహస్యాలు, ఏఐ టెక్నాలజీ కాంబినేషన్‌తో ఓ సరికొత్త సినిమాటిక్ ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు 'ఆర్విహా క్రియేషన్స్' సంస్థ సిద్ధమవుతోంది. ఈ నిర్మాణ సంస్థ తమ తొలి నిర్మాణంగా తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా మూవీ 'ది ప్రాంప్ట్ వార్-రైజ్ ఆఫ్ మహావీర్'. దసరా పండుగను పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌ను, ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. విడుదలైన టైటిల్ పోస్టర్ వినూత్నమైన కాన్సెప్టుతో ప్రేక్షకులలో, సినీ వర్గాల్లో విశేషమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన 'ది ప్రాంప్ట్ వార్-రైజ్ ఆఫ్ మహావీర్' అనే టైటిల్ స్టోరీలోని ప్రధానాంశాన్ని స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా 'రైజ్ ఆఫ్ మహావీర్' అనే ట్యాగ్‌లైన్ కథలోని కీలక పాత్ర, దాని వెనుక ఉన్న అంతుచిక్కని మిస్టరీపై ఉత్కంఠను పెంచుతోంది. భారతీయ ఇతిహాసాలు, పురాణాల్లోన ఆధ్యాత్మిక అంశాలను ఆధునిక టెక్నాలజీతో, ఫ్యూచరిస్టిక్ ఏఐ వరల్డ్ తో మేళవిస్తూ విజువల్ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. టెక్నాలజీ పెరిగిన నేటి యుగంలో పురాణ కథాంశాన్ని ఏఐ ప్రపంచంతో ముడిపెట్టి చెప్పే ఈ ప్రయత్నం ప్రేక్షకులకు ఓ వినూత్నమైన సినిమాటిక్ అనుభూతిని అందించనుంది.

ఈ భారీ ప్రాజెక్టును నిర్మాత నరేష్ గౌడ్ నేతృత్వంలో ఆర్విహా క్రియేషన్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ప్రసన్న కొత్వాల డైరెక్టర్‌గా పరిచయమవుతుండగా.. జీసీ శేఖర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. నూతన సాంకేతిక ఆలోచనలు, యువ టాలెంట్, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్ర బృందం సమగ్రమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
ఈ సినిమాను 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో ఈ చిత్రం రానుంది. అంతేకాకుండా ప్రేక్షకులకు విజువల్స్ పరంగా గ్రాండ్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఈ సినిమాను 3డీ వెర్షన్‌లో కూడా రూపొందిస్తున్నారు. తొలి పోస్టర్‌తోనే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ 'ది ప్రాంప్ట్ వార్' సినిమా వెండితెరపై ఏ స్థాయి సెన్సేషన్ సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.














Click it and Unblock the Notifications
