నర్స్ హత్య కేసు.. స్టాలిన్ విమర్శలు, సీఎం విజయ్ కౌంటర్‌!

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. తిరుప్పూర్ జిల్లా పళ్లగౌండంపాలయంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న 26 ఏళ్ల ఉత్తిర అనే నర్సును ఆమెతో పాటు పనిచేస్తున్న 23 ఏళ్ల పురుష నర్స్ శరవణన్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అక్టోబర్ 15న ఉత్తిర అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అక్టోబర్ 17న పెరుందురై సమీపంలోని విజయమంగళం టోల్ గేట్ వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది.

ఎల్లుండి.. న్యూజిలాండ్ లో టీమిండియా మొదటి టీ20: టైమింగ్స్, లైవ్ టెలికాస్ట్ డీటెయిల్స్
ఎల్లుండి.. న్యూజిలాండ్ లో టీమిండియా మొదటి టీ20: టైమింగ్స్, లైవ్ టెలికాస్ట్ డీటెయిల్స్

పోలీసుల దర్యాప్తులో ఈ హత్యకు సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తిర వద్ద ఉన్న 4 సవర్ల బంగారు తాళిబొట్టు గొలుసును దొంగిలించాలనే ఉద్దేశంతోనే శరవణన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. బాధతురాలని తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో హత్య చేసి ఆమె నగలను ఎత్తుకెళ్లాడని ఈరోడ్ జిల్లా పోలీసులు వెల్లడించారు. నిందితుడు శరవణన్‌ను అక్టోబర్ 19న అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి దొంగిలించిన బంగారాన్ని స్వాధీని చేసుకున్నట్లు, అతడిని న్యాయస్థానం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Tamil Nadu Nurse Murder Case MK Stalin Criticises CM Vijay Gets a Counter over law and order

ఇదిలా ఉండగా.. ఈ హత్య పరిణామం తమిళనాడు రాజకీయంలో శాంతిభద్రతల సమస్యపై తీవ్ర దుమారానికి దారితీసింది. శాంతిభద్రత నిర్వహణపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి పేరుకే హోం శాఖను ఉంచుకున్నారని, పోలీసు శాఖను వేరొకరికి అప్పగించేసి నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు, డ్రెగ్స్ నెట్వర్క్‌లను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

ఉప ఎన్నికల్లో పట్టం కట్టిన ఆ స్థానాలకు భారీ ప్రాజెక్టులను ప్రకటించిన విజయ్
ఉప ఎన్నికల్లో పట్టం కట్టిన ఆ స్థానాలకు భారీ ప్రాజెక్టులను ప్రకటించిన విజయ్

దీనికి సమాధానంగా అధికారపక్షం టీవీకే స్పందిస్తూ.. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. కేవలం కొన్ని నెలల తమ పాలనలోనే నేరాలు పెరిగాయని చెప్పడి సరికాదని, గత డీఎంకే ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ అరికట్టడంలో జరిగిన విఫలమే దీనికి కారణమని ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో పేర్కొన్నారు. నేరాలను అదుపులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+