తెలంగాణ పండగ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్.. మంచు మనోజ్ మాస్టర్ ప్లాన్!
విభిన్నమైన స్టోరీలు, పవర్‌ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో మంచు మనోజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పోతరాజు నేపథ్యంలో రూపొందనున్న ఈ బిగ్ బడ్జెట్ చిత్రాన్ని 'డివైన్ యాక్షన్ థ్రిల్లర్'గా తెరకెక్కిస్తున్నారు. ఆర్పీఏ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ఆ సంస్థకు ప్రొడక్షన్ నం. 4. 'ప్రేమకథా చిత్రం', 'జక్కన్న' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్.పీ.అక్షిత్ రెడ్డి, ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద కో-డైరెక్టర్‌గా పనిచేసిన ఏ. శ్రీధర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ ఈ సినిమా కోసం అత్యంత పవర్‌ఫుల్ స్టోరీని సిద్ధం చేశారు. ఇప్పటివరకు మంచు మనోజ్‌ను చూడని సరికొత్త అవతార్‌లో ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ సినిమా తెలంగాణ బోనాలు, పండుగల వైభవం, స్థానిక సాంప్రదాయాల నేపథ్యంలో సాగనుంది.

పోతరాజు నేపథ్యంలో దైవిక అంశాలు, ఉత్కంఠభరితమైన కథనం, భారీ యాక్షన్ సన్నివేశాల సమ్మేళనంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తెలంగాణ పండుగల వైభవం, సంప్రదాయాల నేపథ్యంతో రూపొందనున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించనుంది.
ఈ చిత్రానికి ఎం. శ్రీకాంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ఆర్. ఆయుష్ రెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ తదితర వివరాలను చిత్రబృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.













Click it and Unblock the Notifications
