ఫస్ట్ డే మిస్ అయ్యాడని.. 'జైలర్ 2’ కోసం ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేశాడు!

టీమిండియా స్టార్ క్రికెట్ సంజు శాంసన్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సారి సంజు శాంసన్ తన తలైవా అభిమానాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. రజనీకాంత్ నటించిన తాజా సినిమా 'జైలర్ 2' చూడటానికి సంజు శాంసన్ ఏకంగా ఓ థియేటర్ మొత్తాన్ని బుక్ చేసేశాడు. తన భార్య, స్నేహితులు, టీమిండియా సపోర్ట్ స్టాఫ్ కోసం ఈ ప్రత్యేక ప్రైవేట్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం ద్వారా రజనీకాంత్‌పై తనకున్న క్రేజ్‌ను చాటుకున్నాడు.

సూర్య కొత్త సినిమా కథ లీక్? పాత బ్లాక్‌బస్టర్‌నే మళ్లీ తీస్తున్నారా?
సూర్య కొత్త సినిమా కథ లీక్? పాత బ్లాక్‌బస్టర్‌నే మళ్లీ తీస్తున్నారా?

సాధారణంగా రజనీకాంత్ సినిమాల ఫస్ట్ డే ఫోస్ట్ షోను సంజు శాంసన్ ఎప్పుడూ మిస్ అవ్వడు. అయితే ఈసారి ఢిల్లీలో ఓ ఈవెంట్ ఉండటం వల్ల సినిమా విడుదలైన మొదటి రోజు చూడలేకపోయాడు. ఆ వెలితిని భర్తి చేసేందుకే సంజు శాంసన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య అనామిక, స్నేహితులు, తమిళం అర్థమయ్యే భారత క్రికెట్ జట్టు సపోర్ట్ స్టాఫ్ అందరినీ ఆహ్వానించి ఈ చిత్రాన్ని కలిసి వీక్షించాడు.

Team India Star Cricketer Sanju Samson Books Entire Theatre to Watch Rajinikanth Jailer 2 Movie

ఈ ప్రత్యేక సందర్భంలో సంజు శాంసన్ మాట్లాడుతూ.. " నాకు రజనీ సర్ సినిమాలు చూడటం చాలా ఇష్టం, ఆయన ప్రతి కొత్త సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను. నిన్న ఢిల్లీలో ఈవెంట్ వల్ల మొదటి రోజు సినిమా చూడలేకపోయాను. కానీ ఈ రోజు అదృష్టవశాత్తూ థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకునే అవకాశం లభించింది. తమిళం తెలిసిన నా భార్య, స్నేహితులు, సపోర్ట్ స్టాఫ్‌ను పిలిచి సినిమా చూశాను" అని సంజు శాంసన్ తన సంతోషాన్ని పంచుకున్నాడు.

'కాకా' సెట్స్ నుంచి లీకైన వీడియో.. వింటేజ్ స్వ్యాగ్‌తో ఊపేస్తున్న మెగాస్టార్!
'కాకా' సెట్స్ నుంచి లీకైన వీడియో.. వింటేజ్ స్వ్యాగ్‌తో ఊపేస్తున్న మెగాస్టార్!

రజనీకాంత్ మాస్ మేనరిజమ్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు దేశవిదేశాల్లో కోట్ల మంది అభిమానులు ఉన్నారు. క్రికెట్ బిజీ షెడ్యూల్ నుంచి సమయం కేటాయించి, కుటుంబం, స్నేహితులతో కలిసి రజనీకాంత్ సినిమా చూసేందుకు సంజు శాంసన్ చేసిన ఈ సందడి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు సంజు శాంసన్ అంకితభావాన్ని, రజనీకాంత్‌పై ఉన్న ప్రేమను ప్రశంసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+