నిజమైన ప్రేమలో చాలా బాధ ఉంటుందంటున్న చైతూ.. ఆమె గురించేనా ?
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ నటి సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం.. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా మారింది. రియల్ స్టోరీ ఆధారంగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ మూవీకి ఈ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. బుజ్జితల్లి, హైలెస్సా పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఫిబ్రవరి 7న చిత్రం విడుదల కానున్న తరుణంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో దూసుకుపోతున్నారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో నిజమైన ప్రేమ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. ఒక నిజమైన ప్రేమలో చాలా బాధ ఉంటుందని చైతూ వ్యాఖ్యానించారు. మీరు ఆ బాధను అనుభవించిన తర్వాత దాని నుంచి బయటపడినప్పుడు.. అది సంబంధాన్ని చాలా భిన్నమైన రీతిలో చూపిస్తుందన్నారు. అలాంటి ఒక ప్రయాణాన్ని ఈ సినిమాలో చూస్తారని చెప్పారు.

అయితే నాగచైతన్య ఈ మాటలు సినిమాను మాత్రమే కాకుండా.. తన వ్యక్తిగత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అటు సినిమాల పరంగా చైతూ నటించిన మూవీస్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. మరోవైపు సమంతతో విడాకుల తర్వాత శోభితాను వివాహం చేసుకోక ముందు వరకు కూడా.. వారి విడాకుల విషయం హాట్ ఇష్యూ గానే నడవడం ఆయనను మనస్తాపానికి గురి చేసిందని భావిస్తున్నారు. దాంతో చైతూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
ఇక తండేల్ మూవీ టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరలు పెంచాలని చిత్రబృందం చేసిన అభ్యర్ధన మేరకు సర్కారు టికెట్ ధరలు పెంచుకునేలా పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో జీఎస్టీతో రూ.50.. మల్టీప్లెక్స్‌ల్లో జీఎస్టీతో రూ.75 పెంచుకునేలా వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండనున్నట్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications