ఇదే నా చివరి సినిమా: సమంత ఎమోషన్

రెండు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయకపోయినప్పటికీ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ గా నిలుస్తోంది సమంత. బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న సెలబ్రిటీల జాబితాను విడుదల చేస్తుంటుంది. ప్రతి నెలా విడుదలయ్యే ఈ జాబితాలో మొదటి స్థానంలో సమంత నిలుస్తోంది. ప్రతి నెలా సమంతే నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంటుండం విశేషం. అలియాభట్, దీపికా పదుకొనే లాంటి పాన్ ఇండియా హీరోయిన్లంతా సమంతకంటే వెనకబడ్డారు. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది.

పాత్రలను తనకు తగినట్లుగా డిజైన్ చేస్తున్నారు
తాజాగా సమంత చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ప్రస్తుతం తాను కావాలనుకుంటే ఎన్నో సినిమాలను అంగీకరించవచ్చని, కానీ తాను వాటిని అంగీకరించే పరిస్థితిలో లేనన్నారు. తాను నటించబోయే ప్రతి సినిమాను తన జీవితంలో చివరి సినిమాగా భావించే నటిస్తానని, తన పాత్ర ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపించాలనే యోచనతో ఉంటానన్నారు. అందుకు తగ్గ పాత్రలనే ఎంచుకుంటానని సమంత వ్యాఖ్యానించారు. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తనకు ఎంతో ఛాలెంజింగ్ పాత్రలను తీసుకొస్తున్నారని, అందుకు తగినట్లుగా వాటిని డిజైన్ చేస్తున్నారని, ఫ్యామిలీమ్యాన్ 2లో తనను ప్రతినాయకురాలిగా చూపించినట్లు సమంత గుర్తుచేశారు.

this movie is my last movie samantha shocking comments

ఆ పాత్రలకు తనకు ఛాలెంజింగ్
సిటాడెల్ రీమేక్ హనీబన్నీ వెబ్ సిరీస్ లో తనచేత పవర్ ఫుల్ యాక్షన్ చేయించారని, తాజాగా వారితోనే మరో ప్రాజెక్టు అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ సిరీస్ లో కూడా తనది ఎంతో క్లిష్టమైన పాత్ర అని, వారితో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఆ పాత్రలను తాను కూడా సవాల్ గా స్వీకరిస్తానన్నారు. ప్రస్తుతం సమంత చేసిన వ్యాఖ్యలు వైరలవడంతోపాటు ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. ఇటీవలే తనకు సినిమా అవకాశాలు రావడంలేదని బహిరంగానే ప్రకటించింది. దక్షిణాదిలో విజయ్ తో ఓ సినిమా ఆఫర్ వచ్చిందంటున్నారు. అలాగే తన సొంత బ్యానరు ట్రూలాలాలో మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమా చేస్తోంది. వీటితోపాటు రెండు వెబ్ సిరీస్ లు ఒప్పుకుంది. సినిమా తెరపై కనపడి రెండు సంవత్సరాలవుతున్నప్పటికీ నెంబర్ వన్ స్థానంలో సమంత నిలవడం విశేషమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+