విలన్ నుంచి హీరోగా.. గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న యువ నటుడు!
వివేక్ చేపూరి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకోవాలని పరితపిస్తున్న యువ నటుడు. 'ఫలక్‌నుమా దాస్' చిత్రంలో రవి అనే పాత్రతో అందరినీ తన విలనిజంతో మెప్పించాడు. 2019లో వచ్చిన ఆ చిత్రంలో విశ్వక్ సేన్‌కి ధీటుగా వివేక్ చేపూరి కనిపించాడు. ఇక ఇప్పుడు ఏడేళ్ల తర్వాత మళ్లీ విశ్వక్ సేన్ దర్శకత్వంలో 'కల్ట్' అనే చిత్రంలో వివేక్ చేపూరి తన మార్క్ క్రియేట్ చేశాడు. 'కల్ట్' చిత్రంలో ఇషాన్ పాత్రలో అందరినీ భయపెట్టేశాడు వివేక్ చేపూరి.
'కల్ట్' చిత్రంలో ఇషాన్ పాత్రకి, వివేక్ నటనకు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రకరకాల ఎడిట్స్‌తో రీల్స్ వైరల్ అవుతున్నాయి. వివేక్ సైతం ఆడియెన్స్ చూపిస్తున్న ఈ ప్రేమకు ఎంతగానో మురిసిపోతోన్నాడు. ఇక అలాంటి వివేక్ త్వరలోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. టి. శరత్ చంద్ర దర్శకత్వంలో తెలుగు, తమిళంలో ద్విభాష చిత్రంగా రూపు దిద్దుకుంటోంది. ఈ సినిమాకి ప్రియేష్ గురుస్వామి కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, టీజర్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.

ఇప్పటివరకు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన వివేక్ చేపూరి ఇప్పుడు సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. హైదరాబాద్ నగర వీధుల నుంచి మొదలైన వివేక్ చేపూరి ప్రయాణం నేటి యువ ఆర్టిస్టులకు గొప్ప స్ఫూర్తినిస్తోంది. కథానాయకుడిగా తన మొదటి ప్రాజెక్టు కోసం అతడు పడుతున్న కష్టం, ఎంచుకున్న కథాంశం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిపెడతాయని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.













Click it and Unblock the Notifications
