ఏపీ గురించి ఒక్క ముక్కలో తేల్చేసిన పూనమ్: హాట్ డిబేట్
AP Assembly elections 2024: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. అటు పోలింగ్ గడువు సమీపిస్తోంది. ఈ నెల 25వ తేదీ నాటితో నామినేషన్లను దాఖలు చేసే గడువు కూడా ముగిసింది. వాటిని ఉపసంహరించుకోవడానికి 29వ తేదీ వరకు గడువు ఉంది.
మే 13వ తేదీన పోలింగ్. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకరవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ ఎన్నికల గడువు దగ్గర పడుతోండటం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తోన్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి.

2019 నాటి ఎన్నికల్లో సాధించిన పట్టును నిలుపుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రూపొందించుకుంది. అప్పటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సంఖ్యను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో ఉందా పార్టీ అగ్రనాయకత్వం. వైనాట్ 175/25 అనే నినాదంతో ప్రచార కార్యక్రమాలను చేపట్టింది.
వైఎస్ఆర్సీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి తెలుగుదేశం పార్టీ సర్వశక్తులనూ ఒడ్డుతోంది. 2019 నాటి ఫలితాలను పునరావృతం కానివ్వకూడదనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా జనసేన- భారతీయ జనతా పార్టీతో పొత్తుపెట్టుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలోనూ భాగస్వామ్యమైంది.
A.P is the new U.P !
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) April 27, 2024
ఈ పరిస్థితుల్లో ప్రముఖ నటి పూనమ్ కౌర్ ఓ ట్వీట్‌ను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంతో పాటు ఏపీ రాజకీయాలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంటారామె. సందర్భం వచ్చిన ప్రతీసారీ ఏపీ రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తుంటారు.
ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి కామెంట్సే పెట్టారు. ఏపీని ఉత్తర ప్రదేశ్‌తో పోల్చారు. ఏపీ ఈజ్ ద న్యూ యూపీ అంటూ కామెంట్స్ పెట్టారు. ఏపీ కొత్త ఉత్తరప్రదేశ్‌గా అవతరిస్తోందంటూ అభివర్ణించారు. దీనిపై జోరుగా డిబేట్ సాగుతోంది ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన అభిమానులు ఈ ట్వీట్‌కు రిప్లైస్ ఇస్తోన్నారు.












Click it and Unblock the Notifications