విజయ్ విడాకుల రచ్చ వేళ.. పెళ్లిపై త్రిష షాకింగ్ కామెంట్స్ !!
త్రిష.. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ దూసుకుపోతుంది. నాలుగు పదుల వయసు దాటినా కూడా అందంతో హృదయాలను కొల్లగొడుతుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో కూడా నటించి మెప్పించింది. ఇక మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ భామ.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
అయితే కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ తో ఆయన భార్య విడాకులు కోరుతూ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కాగా 2023లో విజయ్ - సంగీత మధ్య విభేదాలు వచ్చాయని.. ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పెళ్లైన 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు విడాకులు కోరుతూ సంగీత కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. మరో నటితో సన్నిహితంగా ఉంటున్నారని, నటితో బంధం వీగిపోయిందంటూ తనకు మాట ఇచ్చినప్పటికీ, ఆ మాట తప్పారని ఆమె ఆరోపించారు.

విజయ్ ప్రవర్తన వల్ల గడిచిన రెండేళ్లలో తను తీవ్ర మానసిక వేదన అనుభవించానని, గత్యంతరం లేక విడిపోవడానికి సిద్ధపడ్డానని ఆమె తన విడాకుల పిటిషన్ లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని విజయ్ కి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా విజయ్ - సంగీత మధ్య విడాకులకు కారణం త్రిషనే అని.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. మరోవైపు గతంలో త్రిష ఎంగేజ్మెంట్ చేసుకొని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. నన్ను చాలా మంది పెళ్లి ఎప్పుడు అని అడుగుతుంటారు. దానికి నా దగ్గర ఒకటే సమాధానం ఉంది. నాకు నచ్చిన, సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకకపోతే, అసలు పెళ్లి జరగకపోయినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటే విడాకుల వరకు వెళ్లకూడదని భావిస్తున్నాను. అందుకే తొందరపడి ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోను అని ఆమె వివరించారు.
పెళ్లి అనేది కేవలం సమాజం కోసం తీసుకునే నిర్ణయం కాకూడదని, జీవితాంతం కలిసి ఉండగలమనే నమ్మకం కలిగినప్పుడే ఆ అడుగు వేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. తనకు ప్రేమలో పడటం కంటే.. నచ్చిన వ్యక్తితో కలిసి ఉండటమే తనకు ఇష్టమని ఆమె ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే.. పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరోసారి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే థగ్ లైఫ్, ఐడెంటిటీ, విదాయమర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. ప్రస్తుతం త్రిష తమిళంలో కరుప్పు.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాల్లో నటిస్తుంది. అలానే విజయ్ సేతుపతితో 96 సీక్వెల్ లో నటించనుంది. అయితే సినీ వర్గాల్లో త్రిష పెళ్లి విషయం ఎప్పుడూ హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంటుంది.












Click it and Unblock the Notifications