"కుభేర" మూవీ ఛాన్స్ మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ హిట్ పడలేదనే చెప్పాలి. వచ్చిన సినిమాలు అన్నీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. కాగా రీసెంట్ గానే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'కుబేర' మూవీ బాక్సాఫీస్‌ని ఊపేస్తోంది. ధనుష్, నాగార్జున కలిసి నటించిన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించింది. నాగార్జున, ధనుష్ పెర్ఫార్మెన్స్ పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.33 కోట్ల థియేట్రికల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.29 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవర్సీస్‌లో సినిమా రూ.26 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కర్ణాటకలో రూ.7.35 కోట్లు, కేరళలో రూ.1.10 కోట్లు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి రూ.2.30 కోట్లు వసూలైంది. మొత్తం మీద కుబేరా ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.103 కోట్ల గ్రాస్, రూ.52 కోట్ల షేర్ వసూళ్లను అందుకుని సూపర్ హిట్‌గా నిలిచింది.

అయితే ఈ సినిమాలో నాగార్జున, ధనుష్ పాత్రలకు వేరే నటుల్ని అనుకున్నాడట శేఖర్ కమ్ముల. కానీ వారు రిజెక్ట్ చేయడంతో వీరితో మూవీ తియ్యాలని ఫిక్స్ అయ్యి ఫినిష్ చేసేశారట. ఇప్పుడు ఈ చిత్రం మంచి హిట్ సాధించడంతో వాళ్లు మంచి ఆఫర్ ని మిస్ చేసుకున్నారని జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ నటులు ఎవరా అని అందరూ అనుకుంటున్నారు.
ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరంటే..?
శేఖర్ కమ్ముల ముందు నాగార్జున పాత్ర కోసం మోహన్ లాల్‌తో చేయాలని అనుకున్నారట. కానీ మోహన్ లాల్ ఆసక్తి చూపకపోవడంతో వెంటనే నాగార్జునను సంప్రదించగా ఆయన వెంటనే ఓకే చెప్పారు. అలాగే దేవా పాత్ర కోసం తొలుత విజయ్ దేవరకొండను సంప్రదించారట. అయితే విజయ్ తన ఇమేజ్‌కు ఇది సెట్ కావడం లేదని భావించి చేయలేదట. ఆ తర్వాతే శేఖర్ ధనుష్‌ను సంప్రదించగా, కథ నచ్చడంతో వెంటనే అంగీకరించాడట. ఇప్పుడు ఈ పాత్ర ధనుష్‌కు మరో గుర్తుండిపోయే పాత్రగా నిలిచిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. దాంతో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారని మోహన్ లాల్, విజయ్ దేవరకొండల పేరు ఇప్పుడు చర్చకు వస్తోంది.












Click it and Unblock the Notifications