రామ్‌చరణ్, అల్లు అర్జున్‌కు బ్యాచిలర్ కాక్‌టెయిల్ పార్టీ ఇచ్చిన వరుణ్ తేజ్

హైదరాబాద్: ఇటలీలో వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి పెళ్లి మ్యారేజ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మెగా కుటుంబం సభ్యులందరూ ఇటలీ చేరుకున్నారు. ఆ దేశ కాలమానం ప్రకారం 31వ తేదీ రాత్రి హల్దీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నవంబర్ 1వ తేదీన వధువరులిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిలది లవ్ మ్యారేజ్. ఇదివరకే హైదరాబాద్‌లో వారిద్దరి ఎంగేజ్‌మెంట్ పూర్తయింది. ఇటలీలోని టస్కిన్‌లో ఈ వేడుకలు సాగుతున్నాయి. రామ్ చరణ్, ఆయన తల్లి సురేఖ, భార్య కొణిదెల ఉపాసన, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ ఇటలీ వెళ్లారు. తమ ఫ్యామిలీ మెంబర్స్‌ను కలుసుకున్నారు.

Varun Tej-Lavanya Tripathi marriage: Ram Charan and Allu Arjun attend at Tuscany, Italy

పెళ్లి ఆరంభానికి ముందు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. తమ బంధువులందరికీ కాక్ టెయిల్ పార్టీ ఏర్పాటు చేశారు. రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్.. ఇతర మెగా ఫ్యామిలీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. వారందరూ కలిసి దిగిన గ్రూప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ సెలెబ్రేషన్స్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా కనిపించారు. తల్లితో కలిసి రామ్ చరణ్ దిగిన ఫొటోలు వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో సురేఖ ప్రత్యేకంగా ఫొటోలు దిగడం ఆకట్టుకుంది. పెళ్లి ముగిసిన రెండు రోజుల తరువాత వారంతా ఇటలీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన అనంతరం మెగా ఫ్యామిలీ.. భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలెబ్రిటీలు దీనికి హాజరు కానున్నట్లు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ రిసెప్షన్‌కు అటెండ్ అవుతారు. వధూవరులను ఆశీర్వదిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+