అనసూయ జాతకం చెప్పిన వేణుస్వామి
ప్రస్తుతం వేణుస్వామి గురించి తెలియనివారెవరూ లేరు. సినిమా రంగంతోపాటు రాజకీయ రంగంలోని సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఆయన కూడా ఒక సెలబ్రిటీ అయ్యారు. ఆయన ఏం చెప్పాడు? అనే విషయాన్ని ఎవరూ పట్టించుకునేవారుకాదుకానీ సమంత-నాగచైతన్య విషయంలో చెప్పింది చెప్పినట్లుగా జరగడంతో అందరూ ఒకసారి ఇతనిపై దృష్టిసారించారు. గతంలో ఎవరి గురించి చెప్పాడు? ఎవరి గురించి మాట్లాడారు? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.
వేణుస్వామి చేత పూజ చేయించుకున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారింది. అలాగే నిధి అగర్వాల్ కూడా ప్రభాస్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఇటీవలే డింపుల్ హయతి కూడా ఆయనచేత పూజలు చేయించుకుంది. కొద్దిరోజుల క్రితం అనసూయ కళ్లమ్మట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్న వీడియో ఒకటి షేర్ చేసింది. ఎందుకు ఏడుస్తుంది? ఏమైంది? అంటూ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో అనసూయ గురించి వేణుస్వామి ఏం చెప్పాడు? అనే వివరాలను నెటిజన్లు శోధిస్తున్నారు.

అనసూయ జాతకం 2021 తర్వాత మొత్తం మారిపోతుందని, ఆమెకు జీవితంలోనే పెద్ద మార్పు చోటుచేసుకుంటుందని చెప్పారు. ఆమెకు తిరుగుండదని, చాలాకాలంపాటు టాప్ లోకి వెళుతుందని, ఇండస్ట్రీలో కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అనసూయ రాజకీయాల్లోకి కూడా ప్రవేశించే అవకాశం ఉందన్నారు. ఆయన చెప్పినట్లుగానే 2021 తర్వాత అనసూయ క్రేజ్ భారీగా పెరిగింది. బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల నుంచి భారీస్థాయిలో రెస్పాన్స్ అందుకుంటోంది. రీసెంట్ గా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పి వెండితెరపై దూసుకుపోతోంది.












Click it and Unblock the Notifications