'సలార్' సినిమాపై వేణుస్వామి ఏం చెప్పారంటే..!
యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్. సెప్టెంబరు 28వ తేదీనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో డిసెంబరు 22కు వాయిదా వేశారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు సరిగా రాకపోవడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ రాజీపడకుండా మరికొన్ని సన్నివేశాలను రీషూట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
బాహుబలి తర్వాత విడుదలైన ఏ చిత్రం ఆకట్టుకోలేకపోవడంతో ప్రశాంత్ నీల్ మాయాజాలంతో సలార్ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని పెట్టుకున్నారు. తాజాగా రాజకీయ రంగంలో, సినీరంగంలోని సెలబ్రిటీల జాతకాలు చెప్పి వేణుస్వామి కూడా ఒక సెలబ్రిటీ అయిపోయాడు. బాహుబలి తర్వాత ఏ సినిమా కూడా హిట్టవదంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్... ఈ సినిమాలకు ముందు కూడా వాటి ఫలితం గురించి చెప్పారు. వేణుస్వామి చెప్పినట్లుగానే ఈ మూడు సినిమాలు పరాజయం పాలయ్యాయి.

తాజాగా సలార్ చిత్రానికి సంబంధించి వేణుస్వామి గతంలో ఏం చెప్పారంటూ నెటిజన్లు పాత వీడియోలను సెర్చ్ చేశారు. సలార్ గురించి ఆయన చెప్పిన వీడియో ఒకటి దొరికింది. అందులో ఉన్న వివరాల మేరకు... సలార్ సినిమా మీద ఆశలు పెట్టుకోవద్దని అభిమానులను వేణుస్వామి హెచ్చరిస్తున్నారు. కమర్షియల్ గా ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని, ప్రభాస్ కొంతకాలం ఈ ఫ్లాప్స్ ను ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు. అతను గతంలో చెప్పినట్లుగానే ప్రభాస్ మూడు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. తాజాగా సలార్ పై ఆశలు పెట్టుకోవద్దని చెబుతుండటంతో డార్లింగ్ అభిమానులు ఆ సినిమా విడుదల కోసం, దాని ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications