టాలీవుడ్ లో ఆ హీరో, హీరోయిన్ త్వరలోనే చనిపోతారు: వేణు స్వామి సంచలనం..!
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంటారు. ప్రస్తుతం ఆయన వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా మరోసారి వేణు స్వామి టాలీవుడ్ పై బాంబ్ పేల్చారు. ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 2027, 2028 సంవత్సరాల్లో టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో, ఓ హీరోయిన్ ఇద్దరూ చనిపోతారు అని సంచలన జోస్యం చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు వేణు స్వామి. అయితే వేణు స్వామి వ్యాఖ్యలపై జనాలు ఫైర్ అవుతున్నారు. వేణు స్వామికి వేరే పనేం లేదా..? అంటూ మండిపడుతున్నారు.
Oryyyy😭😭 pic.twitter.com/dT8Zrde3el
— DARLINGUU🦁 (@Darling_IBSSP) August 26, 2026
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ.. " రీసెంట్ గా మూడు నెలల కిందట కూడా నేను చెప్పినా.. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ హీరో, హీరోయిన్ అది కూడా 45 లేదా 46 ఏళ్ల లోపు వారే.. 90 ఏళ్ల ముసలాయన చనిపోయిండు.. మీరు చెప్పేది ఏంది.. ఆయన ఎలాగో చనిపోతడు కదా.. అని అనొద్దు. ఇది అట్ల కాదు యంగెస్ట్ హీరో, హీరోయిన్ 2027, 2028 లో చనిపోతరు. ఇద్దరూ అనారోగ్య సమస్యల కారణంగా చనిపోతారు. అయితే ఒక హీరో మాత్రం అనారోగ్యం లేదా సూసైడ్ చేసుకుని చనిపోయే అవకాశం ఉంది. రెండిట్లో ఏదో ఒకటి జరగొచ్చు. పేర్లు వద్దు.. ఈ మధ్య పేర్లు చెప్పడం మానేశాను. కాకపోతే మేషరాశికి సంబంధించిన హీరోయిన్.. వృచ్ఛిక రాశికి సంబంధించిన హీరో.. మిథునరాశికి సంబంధించిన హీరో.. నా కన్సెర్న్ లో ఉన్నది. ఆ ముగ్గురిలో ఇద్దరు చనిపోతరు.. అని వేణు స్వామి సంచలన జోస్యం చెప్పారు.

అయితే వేణు స్వామి చెప్పిన ఈ జోస్యంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వేణు స్వామికి మరో పని లేదా..? ఎప్పుడూ ఈ సోది మాటలేనా..? అని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఎవరయి ఉంటారు..? అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఆయన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి.












Click it and Unblock the Notifications