విజయ్ దేవరకొండపై దేశ ద్రోహం కేసు..?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన నోటి దురుసుతో ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పటికే చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు కొనితెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరోసారి అలాంటి కామెంట్స్ చేసి కష్టాల్లో పడ్డారు. ఏకంగా పహల్గాం ఉగ్రదాడిపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
విజయ్ దేవరకొండ పహల్గాం ఉగ్రదాడిపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలను గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు హైదరాబాద్ లోని న్యాయవాది లాల్ చౌహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలన్నారు.
పహల్గాం ఉగ్రదాడిపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై గిరిజన సంఘాలు తీవ్రమైన ఆరోపనలు చేస్తున్నాయి. కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్ర దాడి వందల సంవత్సరాల క్రితం గిరిజన వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను పోలి ఉన్నాయి. అసలు 500 సంవత్సరాల క్రితం గిరిజనులు కొట్టుకున్నట్లు, వీళ్లు (ఉగ్రవాదులు) బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ లేకుండా పనులు చేస్తున్నారు అని విజయ్ దేవరకొండ అన్నారు. తాను ఖుషి సినిమా షూటింగ్ సమయంలో పహల్గాం సందర్శించానని అన్నాడు.
ఇక విజయ్ వ్యాఖ్యలు తమను కించపరిచేలా ఉన్నాయని.. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక చౌహాన్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం కింగ్ డమ్. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.
-
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications