విజయ్‌ కు షాకిచ్చిన కొడుకు.. ఇంటి పేరు మార్చుకున్న సంజయ్..??

తమిళ సూపర్ స్టార్, టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ కు వరుస షాకులు తగులుతున్నాయి. అటు రాజకీయంగా, ఇటు వ్యక్తిగత కారణాలతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత జన నాయగన్ మూవీ నిరవధిక వాయిదా.. ఇప్పుడు తన మాజీ భార్య సంగీత వ్యవహారం.. ఇలా వరుస సమస్యలు ఆయన్ను చుట్టు ముట్టాయి. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ విజయ్ కు ఇవి సానుకూలంగా మారుతాయా..? లేక ప్రతికూలంగా మారుతాయా..? అనేది తెలియాల్సి ఉంది.

ఇప్పుడు విజయ్ కు మరోసారి షాక్ తగిలింది. విజయ్ కుమారుడు జాసన్‌ సంజయ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాసన్ సంజయ్ తన తండ్రి ఇంటి పేరు తొలగించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయ్ భార్య సంగీత.. విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విజయ్ కుమారుడు జాసన్‌ సంజయ్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడంతో తమిళనాట ఈ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం జాసన్ సంజయ్.. సిగ్మా అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టైటిల్ కార్డులో తన తండ్రి ఇంటి పేరును తొలగించేశాడు. అంతేకాక తన తల్లి పేరు సంగీత ఇన్షియల్ వచ్చే విధంగా ముందు ఎస్ ను చేర్చుకున్నాడు. ఇక ఇప్పటికే తన తండ్రి విజయ్ ను ఇన్ స్టాలో జాసన్ సంజయ్ అన్ ఫాలో చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Vijay Shocked Thalapathy Vijay Son Sanjay Changes Family Name post Viral Controversy Erupts now

మరోవైపు ఇటీవల విజయ్- త్రిష కలిసి చెన్నైలోని ఓ నిర్మాత కుమారుడి వివాహానికి హాజరయ్యారు. రూమర్స్ మధ్య విజయ్- త్రిష ఒకే కారులో ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాక ఇద్దరూ ఒకే రకమైన అవుట్ ఫిట్ ధరించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+