విశ్వంభర అప్‌డేట్: దసరా కానుకగా మెగా అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ సినిమా 'విశ్వంభర' థియేటర్లలో విడుదల కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బింబిసార పేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్, ఫాంటసీ ప్రపంచం పట్ల ఇప్పటికే విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. అయితే గ్రాఫిక్స్ వర్క్స్ కారణంగా సినిమా పదే పదే వాయిదా పడుతుండటంతో అసలు ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

అసలైన రామాయణం నేను చూపిస్తా.. 'వారణాసి' ఓ విజువల్ వండర్.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్..!
అసలైన రామాయణం నేను చూపిస్తా.. 'వారణాసి' ఓ విజువల్ వండర్.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్..!

పోస్టర్ వర్సెస్ గ్లింప్స్.. అభిమానులు ఏం కోరుకుంటున్నారు
సినిమా విడుదలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా చిత్రబృందం మళ్లీ ఈ ప్రాజెక్టును వార్తల్లో నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం ఓ కొత్త పోస్టర్‌ను మాత్రమే విడుదల చేస్తే సోషల్ మీడియాలో కొంతవరకు సందడి పెరగొచ్చు కానీ అభిమానుల్లో ఉన్న సందేహాలకు అది పూర్తి సమాధానం ఇవ్వలేదు. దీనికంటే ఓ చిన్న ప్రమోషనల్ వీడియో లేదా టీజర్ వంటి గ్లింప్స్‌ను విడుదల చేస్తే దాని ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి సరికొత్త లుక్‌తో పాటు కొన్ని విజువల్స్ చూపిస్తే.. సినిమాపై మళ్లీ భారీగా బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.

Vishwambhara Dasara Update Big Surprise Loading for Megastar Chiranjeevi Fans Full Details Here
చిరంజీవి - మహేష్‌బాబు కాంబినేషన్‌లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ
చిరంజీవి - మహేష్‌బాబు కాంబినేషన్‌లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ

అధికారిక ప్రకటనపై ఉత్కంఠ
అయితే దసరా సర్‌ప్రైజ్‌పై గానీ లేదా సినిమా రిలీజ్ డేట్‌పై గానీ మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం చిత్ర నిర్మాణ సంస్థ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించింది. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్ అభిమానుల ముందుకు ఏమైనా కొత్త కంటెంట్ లేదా పక్కా రిలీజ్ డేట్ అప్‌డేట్‌తో వస్తారో లేదో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+