Philately Passport: అర్ధరాత్రి పోస్టాఫీసు దగ్గర క్యూ.. క్రేజీ ఐడియాకి ఫిదా అవుతున్న ట్రిప్ లవర్స్!

సాధారణంగా ఉదయం పూట బెంగుళూరు లాంటి మహా నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లు, కాఫీ కొట్ల దగ్గర హడావుడి కనిపిస్తుంది. కానీ ఈ వీకెండ్‌లో మాత్రం నగరవాసులు ఏకంగా తెల్లవారుజామున 2 గంటలకే నిద్ర లేచి మరీ రోడ్ల మీద క్యూ కట్టారు. ఐఫోన్ సేలో, పండగ ప్రత్యేకతలో కాదే ఇది.. ఏ దేశం వెళ్లేందుకో ఇచ్చే వీసా పాస్‌పోర్ట్ అంతకంటే కాదు! ఒక సరికొత్త ట్రెవల్ ట్రెండ్ కోసం, తమ ప్రయాణ జ్ఞాపకాలను పదిలపరుచుకునే 'ఫిలాటలీ పాస్‌పోర్ట్' (Philately Passport) కోసం జనం పడిన పాట్లు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.

అసలేంటి ఈ ఫిలాటలీ పాస్‌పోర్ట్ క్రేజ్?

పోస్టల్ స్టాంపులు, వాటి చరిత్ర, డిజైన్లు, వాటి వెనుక ఉన్న కథలను సేకరించే అభిరుచినే 'ఫిలాటలీ' అంటారు. కర్ణాటక పోస్టల్ సర్కిల్ (KPC) ఈ అరుదైన అభిరుచిని టూరిజంతో ముడిపెడుతూ 2024లో 'ఫిలాటలీ పాస్‌పోర్ట్' అనే సరికొత్త ఇనిషియేటివ్‌ను తీసుకొచ్చింది. ఇది విదేశీ ప్రయాణాలకు పనిచేసే పాస్‌పోర్ట్ కాకపోయినా.. మన రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, మ్యూజియంలు, పర్యాటక ప్రాంతాలను వినూత్న రీతిలో అన్వేషించేలా ఒక ట్రెజర్ హంట్ అనుభూతిని ఇస్తుంది. ఇందులో ప్రత్యేకమైన 'పర్మనెంట్ పిక్టోరియల్ క్యాన్సిలేషన్స్' (PPC) అంటే ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక పోస్టల్ ముద్రలను ఈ బుక్‌లెట్‌లో సేకరించవచ్చు. మనం తిరిగిన ప్రతి ప్రాంతం పోస్టాఫీసులో ఆ స్టాంప్ వేయించుకుంటే, ఆ బుక్‌లెట్ మనోహరమైన వ్యక్తిగత ట్రావెలాగ్‌గా మారుతుంది.

Karnataka Philately Passport Craze Travelers Queue Up at 2 AM for Viral Postal Keepsake Booklets

తెల్లవారుజామున 2 గంటలకే మొదలైన క్యూలైన్లు!

కర్ణాటకలో ఈ పాస్‌పోర్ట్‌ల విక్రయం కోసం బెంగుళూరులోని కబ్బన్ పార్క్ దగ్గరున్న జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO)తో పాటు మైసూర్, మంగళూరు, బెళగావిలలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఒక్కో పాస్‌పోర్ట్ ధర రూ. 600 చొప్పున 'ముందు వచ్చిన వారికి మొదట ప్రాధాన్యత' అనే పద్ధతిలో విక్రయించారు. ఒక్కో వ్యక్తికి ఒక్క బుక్‌లెట్ మాత్రమే అనే నిబంధన పెట్టడంతో జనాల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. జూలై నెలలో జరిగిన సేల్ సమయంలోనే ఇది బాగా వైరల్ కావడంతో, ఈసారైతే జనం రాత్రికి రాత్రే నిద్ర కూడా మానుకుని క్యూ కట్టారు. ఉదయం 9-10 గంటలకు కౌంటర్లు తెరుస్తారంటే.. వీరు అర్ధరాత్రి 2 గంటల నుంచే గేట్ల వద్ద నిలబడ్డారు. ఒకరైతే ఏకంగా శుక్రవారం రాత్రి 10 గంటలకే వచ్చి లైన్లో నిలబడి మొదటి పాస్‌పోర్ట్ సొంతం చేసుకున్నారంటే ఈ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆఫీసులోనే అరగంట పాటు ఆ పని.. కంపెనీ క్రేజీ ఐడియా!
ఆఫీసులోనే అరగంట పాటు ఆ పని.. కంపెనీ క్రేజీ ఐడియా!

క్యూలో సరదా ముచ్చట్లు.. ఇండోర్ గేమ్స్‌తో కాలక్షేపం!

గతంలో ఈ పాస్‌పోర్ట్‌ల కోసం వచ్చిన జనం లాప్‌టాప్‌లు, పేపర్లు పట్టుకుని రాగా.. ఈసారి మాత్రం ఏకంగా 5 నుంచి 8 గంటలు నిలబడాల్సి రావడంతో తమ స్నేహితులను వెంటేసుకుని వచ్చారు. క్యూలైన్లలోనే యూనో (UNO) కార్డ్స్ ఆడుతూ, లూడో ఆడుతూ, పుస్తకాలు చదువుతూ వినూత్నంగా కాలక్షేపం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోల్లో కొందరైతే ఏకంగా పెద్ద స్పీకర్లు పట్టుకుని వచ్చి హల్చల్ చేశారు. జనం విపరీతంగా పోగవడంతో టోకెన్లు అయిపోయాక పోస్టల్ శాఖ సోషల్ మీడియా ద్వారా ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేయాల్సి వచ్చిందంటే దీనికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో వేరే చెప్పనక్కర్లేదు. కర్ణాటకలో ఈ భారీ విజయవంతమైన స్పందన చూసి, ఇప్పుడు తమిళనాడు పోస్టల్ సర్కిల్ కూడా చెన్నైలో ఈ ఇనిషియేటివ్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.

పాకెట్ ఫ్రెండ్లీ ఫారిన్ ట్రిప్.. తక్కువ ధరకే ఈ దేశాల్లో పర్యటించొచ్చు.. వివరాలు ఇవే..
పాకెట్ ఫ్రెండ్లీ ఫారిన్ ట్రిప్.. తక్కువ ధరకే ఈ దేశాల్లో పర్యటించొచ్చు.. వివరాలు ఇవే..

పాత జ్ఞాపకాలను తట్టిలేపే అద్భుతమైన ప్రయాణం!

ఈ చిన్న బుక్‌లెట్ కేవలం స్టాంపుల సేకరణ మాత్రమే కాదు.. రద్దీగా ఉండే నగర జీవనంలో, అందరూ వెళ్లే సాధారణ ప్రదేశాలకు వెళ్లకుండా కొత్త ప్రాంతాలను అన్వేషించేలా చేస్తుంది. ఒక పోస్టల్ ముద్ర కోసం వెళ్లే క్రమంలో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న పాత కట్టడాలు చూడొచ్చు, మ్యూజియంలలో ఎక్కువ సమయం గడపొచ్చు లేదా ఆ ప్రాంత విశేషాల గురించి పోస్టల్ ఉద్యోగులతో ముచ్చటించవచ్చు. మొత్తానికి ఈ డిజిటల్ యుగంలోనూ పోస్టల్ శాఖ తెచ్చిన ఈ చిన్న ఐడియా ట్రిప్ లవర్స్‌ను నిద్రలేకుండా చేసి, సరికొత్త ప్రయాణాలకు దారితీస్తోంది!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+