‘విశ్వంభర’ ఇక రానట్లేనా?.. డబ్బులు మనవి కావుగా!!
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన 'కాకా' ప్రాజెక్ట్ గ్లింప్స్ అభిమానుల్లో ఊహించని జోష్ నింపింది. అయితే, అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన 'విశ్వంభర' నుంచి మాత్రం ఎలాంటి సాలిడ్ అప్‌డేట్ రాకపోవడం మెగా ఫ్యాన్స్‌ను కొంత నిరాశకు గురిచేసింది. ఈ దసరాకే సినిమా థియేటర్లలోకి వస్తుందని, బర్త్‌డే రోజే అధికారిక రిలీజ్ డేట్ ప్రకటిస్తారని ప్రచారం జరిగినప్పటికీ... చిత్రబృందం కేవలం ఒక పోస్టర్‌తో సరిపెట్టింది. అందులో విడుదల తేదీ ఊసు లేకపోవడంపై ట్రేడ్ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.
షూటింగ్ ఓకే
టాక్ ప్రకారం, ఈ సినిమా విడుదల తేదీపై నిర్మాతలు ఇప్పటికీ ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు. 'విశ్వంభర' షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ, విడుదల ఆలస్యమవ్వడానికి ప్రధాన కారణం విజువల్ ఎఫెక్ట్స్ అని తెలుస్తోంది. చిత్రానికి సంబంధించిన కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. సమాచారం ప్రకారం, సీజీకి సంబంధించి కనీసం 30 శాతం వరకు వర్క్ పెండింగ్‌లోనే ఉందట. ఆ విజువల్స్ పూర్తియి చేతికి వచ్చిన తర్వాత కూడా కరెక్టోరియల్ వర్క్స్, క్వాలిటీ చెెక్కింగ్స్ పూర్తి చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

2027 సమరమేనా?
ఒకవేళ ఈ దసరా రేసు నుంచి తప్పుకుంటే, ఈ ఏడాదిలో సినిమా రావడం దాదాపు అసాధ్యమే. వచ్చే సంక్రాంతి బరిలో ఎలాగూ 'కాకా' దిగుతుండటంతో 'విశ్వంభర'కు అక్కడ కూడా స్పేస్ లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ నేరుగా 2027 వేసవికి వాయిదా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.వాస్తవానికి 'మన శంకర వరప్రసాద్ గారు' కంటే ముందే రావలసిన ఈ విజువల్ వండర్, ఇప్పుడు 'కాకా' తర్వాత థియేటర్లలోకి వస్తే అభిమానుల ఆసక్తి ఏమేరకు ఉంటుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. మరి ఈ గ్రాఫిక్స్ అడ్డంకులను దాటుకుని 'విశ్వంభర' ఎప్పుడు ప్రేక్షకులను పలకరిస్తుందో వేచి చూడాలి!














Click it and Unblock the Notifications