ఒక్క హీరో కూడా ఎన్టీఆర్‌కు 'ఆ విషయం' చెప్పలేదు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన చిత్రం దేవర. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం రూ.500 కోట్లగ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో రూ.300 కోట్ల బడ్జెట్ తో నందమూరి కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించారు. మొదటిరోజే రూ.172 కోట్ల వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపింది. కొరటాల శివ గత చిత్రం ఆచార్య అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత ఒక్క హీరో కూడా అతనితో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. అల్లు అర్జున్ తో అనుకున్న సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది.

కొరటాలకు అండగా తారక్
అటువంటి సమయంలో ఎన్టీఆర్ కొరటాలకు అండగా నిలబడడంతో దేవరను తెరకెక్కించారు. రెండో భాగం గురించి ఇటీవలే కొన్ని విషయాలను కొరటాల పంచుకున్నారు. సక్సెస్ మీట్ లో నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఇదే విషయం తెలిపారు. దర్శకుడిగా అండగా నిలబడ్డ తారక్ తన అభిమాన హీరో అని బహిరంగంగానే చెప్పేశారు. అటువంటి తారక్ సినిమా విడుదలైన తర్వాత హిట్ అయితే తెలుగులో ఒక్క స్టార్ హీరో కూడా కనీసం ట్వీట్ కూడా చేయలేదు. కేవలం హీరో నిఖిల్ మాత్రం ట్వీట్ చేసి తారక్ కు, కొరటాలకు శుభాకాంక్షలు తెలియజేశాడు.

Which Telugu star hero doesn t want the success of Jr NTR Devara

నటనా? నిజమా?
అగ్ర కథానాయకులుగా ఉన్న పవన్ కల్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, నాని, విజయ్ దేవరకొండ, రవితేజ తదితర హీరోలెవరూ కనీసం చిన్న ట్వీట్ కూడా ఎందుకు చేయలేదా? అని అభిమానులు ప్రశ్నించుకుంటున్నారు. అందుకు కారణాలేంటనేది తెలియాలి. పరిశ్రమలో హీరోలంతా బయటకు బాగున్నట్లు కనిపిస్తుంటారు. అది నటనా? లేదంటే నిజమా? అనేది అభిమానులకు అర్థం కావడంలేదు. నిజమే అయితే వారంతా శుభాకాంక్షలు తెలియజేసి ఉండాలి. అలా చేయలేదు అంటే మన తెలుగు హీరోలంతా బయటకు ఒకలా, లోపల మరోలా ఉంటారని అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+