Fact Check: ప్రజా వేదిక నిర్మాణ ఖర్చెంతో తెలుసా ? ఏపీ సర్కార్ క్లారిటీ..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాలపై జాతీయ స్ధాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ వ్యూహాత్మకంగా టీడీపీని టార్గెట్ చేసేందుకు ప్రజా వేదికను తెరపైకి తెచ్చింది. 2015-19 మధ్యలో చంద్రబాబు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణ కోసం నిర్మించి, వాడిన ప్రజావేదిక కోసం పెట్టిన ఖర్చుతో పోలిస్తే రుషికొండ నిర్మాణాల కోసం తక్కువ ఖర్చే పెట్టామంటూ వైసీపీ కౌంటర్ ఇస్తోంది. దీనిపై ఇవాళ ఏపీ ప్రభుత్వం స్పందించింది.
అమరావతిలో ప్రజా వేదిక నిర్మాణం కోసం అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రూ.900 కోట్లు ఖర్చు చేసిందంటూ వైసీపీ ఛానల్ సాక్షిలో జరిగిన చర్చలో పేర్కొనడాన్ని తప్పుబడుతూ ఏపీ ప్రభుత్వం ఇవాళ ఫ్యాక్ట్ చెక్ విడుదల చేసింది. ఇందులో ప్రజా వేదికకు అయిన ఖర్చు రూ.900 కోట్లు కాదని, కేవలం రూ.90 లక్షలు మాత్రమేనని తేల్చి చెప్పేసింది. ఇందుకు సంబంధించి అప్పటలో ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సైతం జత చేసింది. తద్వారా రూ.900 కోట్ల ప్రచారం ఒట్టిదేనని ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లయింది.

ప్రజా వేదిక నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం రూ.90 లక్షలు. 2017వ సంవత్సరం ఏప్రిల్ నాలుగున జారీ అయిన జీవో ప్రకారం ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ నుంచి, ప్రజా వేదిక నిర్మాణానికి, రూ.90 లక్షల రూపాయల నిధులు జారీ అయ్యాయి. ఆ నిధులు కేవలం నిర్మాణానికి ఉపయోగించారు. ప్రజా వేదిక వద్ద పోలీస్… pic.twitter.com/jQo8OijYan
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) June 19, 2024
"ప్రజా వేదిక నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం రూ.90 లక్షలు. 2017వ సంవత్సరం ఏప్రిల్ నాలుగున జారీ అయిన జీవో ప్రకారం ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ నుంచి, ప్రజా వేదిక నిర్మాణానికి, రూ.90 లక్షల రూపాయల నిధులు జారీ అయ్యాయి. ఆ నిధులు కేవలం నిర్మాణానికి ఉపయోగించారు. ప్రజా వేదిక వద్ద పోలీస్ సెక్యూరిటీ అవుట్ పోస్టులు.. పార్కింగ్ స్థలం ఏర్పాటు.. వంటి వాటికి కలిపి.. కోటీ తొంబై లక్షలు ఖర్చు అయ్యాయి. ప్రజా వేదిక నిర్మాణానికి రూ.900 కోట్లు ఖర్చు అనేది పూర్తిగా అవాస్తవం" అని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ లో పేర్కొంది.

Fact Check
వాదన
ప్రజా వేదిక నిర్మాణానికి రూ.900 కోట్ల ఖర్చు అయిందంటూ ప్రచారం
వాస్తవం
ప్రజా వేదిక నిర్మాణానికి రూ.90 లక్షలే ఖర్చయిందని ప్రభుత్వం క్లారిటీ












Click it and Unblock the Notifications