Fact Check: నాగ్ పూర్-ముంబై రైలు మాయం ? రైల్వేశాఖ క్లారిటీ ఇదే..!

మహారాష్ట్ర లోని నాగ్ పూర్ నుంచి ముంబై వెళ్తున్న గూడ్స్ రైలు ఒకటి మాయమైనట్లు వస్తున్న వార్తలపై సెంట్రల్ రైల్వే ఇవాళ స్పష్టత ఇచ్చింది.

మహారాష్ట్రలో సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చే నాగ్ పూర్-ముంబై స్టేషన్ల మధ్య 90 కంటెయినర్లతో బయలుదేరిన గూడ్స్ రైలు సినీ ఫక్కీలో మాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. నాగ్ పూర్ నుంచి కంటెయినర్లతో ముంబైకి బయలుదేరిన ఈ రైలును మధ్యలో కొందరు మాయం చేసినట్లు వార్తలు రావడంతో తీవ్ర కలకలం రేగింది. దీనిపై సెంట్రల్ రైల్వే ఇవాళ క్లారిటీ ఇచ్చింది.

central railway clarified on Nagpur-Mumbai Train Missing rumours-here is what happened

నాగ్ పూర్-ముంబై రైలు మిస్సింగ్ అంటూ పలు పత్రికల్లో, ఆన్ లైన్లో కథనాలు రావడంతో దీనిపై ఇవాళ సెంట్రల్ రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేస్తూ ట్వీట్ చేశారు. ఇందులో రైలు మిస్సింగ్ కథనాల్ని వారు తీవ్రంగా ఖండించారు. అసలేం జరిగిందో అధికారులు వెల్లడించారు. ఈ రైలు నాగ్ పూర్ లోని మిహాన్ లో ఉన్న ఇన్ ల్యాండ్ కంటెయినర్ డిపో (ఐసీడీ) నుంచి ఫిబ్రవరి 1న బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. ఇది భూసవాల్ డివిజన్ లోని షెగాన్ స్టేషన్ కు ఫిబ్రవరి 5న చేరుకుందన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జేఎన్పీటీ పోర్టుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అంతే కానీ ఈ రైలు ఎక్కడికీ మిస్ కాలేదన్నారు.

central railway clarified on Nagpur-Mumbai Train Missing rumours-here is what happened

అంటే వాస్తవానికి రైలు మార్గంలో ఇంత భారీ కంటెయినర్లను జేఎన్పీటీ పోర్టుకు తరలించే అవకాశం లేకపోవడంతో నాగ్ పూర్ నుంచి షెగాన్ స్టేషన్ వరకూ తెచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పోర్టుకు తరలించినట్లు అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం తెలియకుండా రైలు ముంబైకి రాలేదని, కాబట్టి మిస్సయినట్లు ప్రచారం జరుగుతోందని సెంట్రల్ రైల్వే క్లారిటీ ఇచ్చింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Fact Check

వాదన

నాగ్ పూర్ నుంచి ముంబై వెళ్తున్న 90 కంటెయినర్ల గూడ్స్ రైలు మధ్యలో మిస్సింగ్

వాస్తవం

నాగ్ పూర్ నుంచి బయలుదేరిన రైలు మధ్యలో రోడ్డు మార్గంలో పోర్టుకు కంటెయినర్లు తీసుకెళ్లిందని సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+