Fact Check: కాశీ విశ్వనాధుని ఆలయంలో నందీ విగ్రహం జ్ఞానవాపి మసీదువైపు చూస్తోందా?
ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో జ్ఞానవాపి మసీదులో నిర్వహించిన సర్వే పలు వివాదాల మధ్య ముగిసింది. ఇందులో మసీదులో శివలింగం దొరికినట్లు పేర్కొన్న అధికారులు ఆ మేరకు ఆ ప్రాంతాన్ని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మసీదు పాలక మండలి హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ మసీదులో దొరికింది శివలింగం కాదని ఓ ఫౌంటేన్ అని మరికొందరు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వన్ ఇండియా వాస్తవాల నిర్ధారణకు ప్రయత్నించింది.
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫొటోల్ని గమనిస్తే ఇందులో ఒకే ఫొటోలో రెండు చిత్రాలున్నాయి. ఇందులో ఒకటి నంది విగ్రహం అయితే మరొకటి హిందూ దేవుడు శివుడి విగ్రహం. మరొక చిత్రంలో నంది, శివుడి విగ్రహాలు వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం నుండి వచ్చినవని, అది మసీదుకు ఎదురుగా ఉన్నట్లు జ్ఞానవాపి మసీదును ఇందులో కలిపినట్లు తెలుస్తోంది.

అయితే సోషల్ మీడియోల షేర్ చేస్తున్న చిత్రం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయానికి చెందినది కాదని వన్ఇండియా నిర్ధారణలో తేలింది. ఇది నిజానికి మహారాష్ట్రలోని వాయ్‌లోని కాశీ విశ్వేశ్వర దేవాలయానికి చెందినదిగా నిర్ధారణ అయింది. గతంలో వారణాసిలోని ఒక న్యాయస్థానం జ్ఞాన్వాపి మసీదు సముదాయంలోని ఒక చెరువును అక్కడ 'శివలింగం' ఉన్నాయన్న నివేదికల మధ్య దాన్నిమూసివేయాలని ఆదేశించింది.
జ్ఞానవాపి మసీదు కాశీ విశ్వనాధుని ఆలయానికి సమీపంలో ఉంది. దాని బయట గోడలపై ఉన్న విగ్రహాల ముందు రోజువారీ ప్రార్థనలకు అనుమతి కోరుతూ మహిళల బృందం చేసిన అభ్యర్థనను స్థానిక కోర్టు విచారిస్తోంది. ఈ వ్యపహారం పూర్తిగా పురావస్తు సర్వే విభాగం పరిధిలో ఉంది. న్యాయవాదులకు సర్వే పని గురించి తెలియదు కాబట్టి, పనికి కొంత సమయం పట్టిందని ఈ కేసులో హిందూ తరపు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ తెలిపారు.

Fact Check
వాదన
కాశీ విశ్వనాధుని ఆలయంలో నంది విగ్రహం జ్ఞానవాపి మసీదువైపు చూస్తోంది.
వాస్తవం
ఫొటోలోని నందీ విగ్రహం మహారాష్ట్రలోని కాశీ విశ్వేశ్వరాలయంలోనిదని తేలింది.