Fact Check: కులాల వారీగా ఏపీ ఓటర్ల జాబితా విడుదల..ఇందులో నిజమెంత..?
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నో వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో చాలా వరకు నిజాలు కనిపించడం లేదు. కొందరు తమ స్వార్థం కోసం ఇలాంటి తప్పుడు పోస్టింగులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల పండుగ జరుగుతున్న వేళ ఇలాంటి అవాస్తవాలపై జాగ్రత్తతో ఉండాలని ఎన్నికల సంఘం సూచించింది.తాజాగా ఎన్నికల సంఘం పేరుతోనే ఓ పోస్టు వైరల్ అయ్యింది దానిపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం స్పందించింది.
వైరల్ అవుతున్న పోస్టు ఏంటి..?
మే 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం కులాలవారీగా ఓటర్ల జాబితాను విడుదల చేసిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్‌గా మారింది.;పైగా ఇది ఏపీ ఎన్నికల సంఘం విడుదల చేసిందని పేర్కొంటూ పోస్టుపై లోగోను కూడా ఎడిట్ చేసి వేశారు. అయితే దీనిపై ఏపీ ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల సంఘం అసలు కులాల వారీగా ఓటర్ల వివరాలు ఎక్కడా విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ఈమేరకు చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా స్పష్టం చేసింది.

ఫ్యాక్ట్ చెక్ చేసిన ఎన్నికల సంఘం
వైరల్ అవుతున్న పోస్టు పై ఫ్యాక్ట్ చెకింగ్ నిర్వహించడం జరిగిందని ఈ పోస్టు మొత్తం ఫ్యాబ్రికేటెడ్ అని ఈసీ స్పష్టం చేసింది. ఈ తప్పుడు సమాచారంను నమ్మొద్దంటూ ఎక్స్ వేదికగా ఈసీ పేర్కొంది. మంచి మాటను నిజాన్ని ఇతరులకు పంచండి తప్పితే అబద్దాలు కాదంటూ ఈసీ ఎక్స్ వేదికగా సూచించింది.ఇలాంటి పోస్టులు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్న వారిపై సీరియస్ అయిన ఈసీ గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
🚨 BUSTED! 🚨
— Chief Electoral Officer, Andhra Pradesh (@CEOAndhra) May 20, 2024
It's time to set the record straight! The following data circulating online is FALSE! 🛑
🔍 After thorough fact-checking, it's clear that the information being shared is completely fabricated. Don't be fooled by misinformation!
Let's keep our feeds filled with… pic.twitter.com/ORJHC9NxGk
మొత్తానికి ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు పోస్టుంగులు కథనాలు చాలామందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోషల్ మీడియాను మంచి వ్యాపింపచేసేందుకు వినియోగించాలి తప్పితే చెడును వ్యాపింపచేయడానికి కాదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Fact Check
వాదన
ఏపీలో కులాల వారీగా ఓటర్ల జాబితా విడుదల చేసిన ఈసీ
వాస్తవం
ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాత కులాల వారీగా ఏపీలో ఎలాంటి ఓటర్ల జాబితా విడుదల చేయలేదంటూ స్పష్టం చేసిన ఈసీ
రేటింగ్
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications