Fact check : కరోనా వేరియంట్‌పై సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ చక్కర్లు...
దేశంలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నకొద్ది కొత్త వేరియెంట్స్ వెలుగుచూస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ వేరియెంట్స్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించినట్లుగా కొన్ని మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతున్నాయి.
భారత్‌లో 736 యూకె వేరియెంట్స్,34 సౌతాఫ్రికా వేరియంట్స్, ఒక బ్రెజిల్ వేరియెంట్‌ను కేంద్రం ధ్రువీకరించినట్లు ఆ మెసేజ్‌లో కనిపిస్తోంది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. ఆ మెసేజ్ పూర్తిగా ఫేక్ అని తెలిపింది. కరోనా వేరియంట్స్‌కు సంబంధించి కేంద్రం ఇప్పటివరకూ ఎలాంటి ప్రెస్ నోట్స్ విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
A message circulating on #WhatsApp enumerating several #COVID19 related inputs is #falsely claiming to be a press release put out by the Ministry of Health.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) April 15, 2021
The claims made in the message are #Fake. No such Press Release has been issued by the @MoHFW_INDIA. pic.twitter.com/Fibmfe4cxW
మరోవైపు, దేశంలో కొత్త వేరియంట్స్‌ను గుర్తించినట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రచురిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆ విషయాలు వెల్లడిస్తున్నట్లు చెబుతున్నాయి. అయితే కేంద్రం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. కొత్త వేరియంట్స్‌పై కేంద్రం సరైన సమయంలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Recommended Video
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2,00,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13,65,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 1038 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,73,123కి చేరింది. ప్రస్తుతం దేశంలో 14,71,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 58వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. కరోనా నియంత్రణ కోసం మహారాష్ట్రలో సెక్షన్ 144తో పాటు జనతా కర్ఫ్యూ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. 15 రోజుల పాటు రాత్రి 8గంటల నుంచి ఉదయం 7గంటల వరకు జనతా కర్ఫ్యూ అమలులో ఉండనుంది.

Fact Check
వాదన
కరోనా వేరియంట్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
వాస్తవం
కరోనా వేరియంట్‌పై ఇప్పటివరకూ కేంద్రం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.












Click it and Unblock the Notifications