Fact check: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా సీఎం వైఎస్ జగన్ ప్రజల భూములను కాజేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం గురించే పదే పదే ప్రస్తావిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించి భయాందోళనకు గురిచేస్తున్నారు.

కొత్త చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతాయని.. తమకు తెలియకుండానే వేరే వ్యక్తులు తమ భూములను కాజేసే అవకాశం ఉంటుందని లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. అటు సీఎం జగన్ సైతం చంద్రబాబుకు గట్టిగానే కౌంటరిచ్చాస్తున్నారు. తాను భూములు పంచేవాడినే కానీ..లాక్కునే వాడిని కాదంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు.

Facts about Land Titling Act

భూ వివాదాల కోసం సివిల్స్ కోర్టులను ఆశ్రయించకుండా చేయడం వల్ల సమస్య మరింత క్లిష్టంగా మారుతుందని, ట్రైబ్యునళ్లను ఆశ్రయించాల్సి రావడంతో సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతారని, స్థిరాస్తుల వివాద పరిష్కారం కోసం కోర్టులకు వెళ్లిన ప్రజలు.. ఇప్పుడు పరిష్కారం కోసం తిరిగి అధికారుల దగ్గరకే వెళ్లాల్సి వస్తోందని తప్పుడు, అవగాహన లేని ఆరోపణలు చేస్తున్నారు.దీంతో పాటు ఒరిజినల్ పత్రాలను ఇవ్వకుండా జిరాక్స్ మాత్రమే ఇస్తున్నారనే ప్రచారం టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం టీడీపీ నేతలు చెప్పిన దానికి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది.

కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా వారికి ఏపీ ప్రభుత్వం ఒరిజినల్ పత్రాలనే ఇవ్వడ జరిగింది. తాజాగా కొందరు తమ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఒరిజినల్ పత్రాలను ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ పత్రాలను ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకుంటుందని ప్రచారం చేస్తున్నారని..కానీ తమకు ఒరిజినల్ పత్రాలను ఇచ్చారని కొందరు సాక్ష్యాలను కూడా చూపించారు. ఈ ఘటపతో టీడీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారనే విషయం బట్టబయలైంది.

Fact Check

వాదన

లాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదు

వాస్తవం

కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా వారికి ఏపీ ప్రభుత్వం ఒరిజినల్ పత్రాలనే ఇవ్వడ జరిగింది.

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+